https://oktelugu.com/

Shruti Haasan: ఆ పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ అంటే శృతిహాసన్ కి నచ్చదా? అసలు ఏం జరిగింది

మెగాస్టార్ నటించిన వాల్తేరు వీరయ్య, బాలయ్య నటించిన వీర సింహారెడ్డి సినిమాలతో సూపర్ హిట్స్ ను అందుకుంటే ఈ సంవత్సరం సంక్రాంతితో సలార్ లో కనిపించి సాలిడ్ హిట్ ను సొంతం చేసుకుంది.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : January 31, 2024 / 02:06 PM IST
    Follow us on

    Shruti Haasan: శృతిహాసన్ గురించి పరిచయం అవసరం లేదు. ఈమె నటించిన సినిమాలు చాలా వరకు హిట్ అవడంతో అమ్మడు రేంజ్ మారిపోయింది. కమలహాసన్ కూతురిగా ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు తన టాలెంట్ తో ఇప్పటికీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతుంది. ఈ మధ్య అమ్మడు నటించిన అన్ని సినిమాలు సూపర్ హిట్స్ ను అందుకోవడంతో లక్కీ హీరోయిన్ గా మారిపోయింది. గత సంవత్సరం సంక్రాంతి కానుకగా వచ్చిన సినిమాలతో కూడా సూపర్ హిట్స్ ను తన ఖాతాలో వేసుకుంది శృతిహాసన్.

    మెగాస్టార్ నటించిన వాల్తేరు వీరయ్య, బాలయ్య నటించిన వీర సింహారెడ్డి సినిమాలతో సూపర్ హిట్స్ ను అందుకుంటే ఈ సంవత్సరం సంక్రాంతితో సలార్ లో కనిపించి సాలిడ్ హిట్ ను సొంతం చేసుకుంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన సలార్ సినిమాలో హీరోయిన్ గా నటించి పాన్ ఇండియా హీరోయిన్ గా పేరు సంపాదించింది. అయితే తనను పాన్ ఇండియా స్టార్ గా పిలవడంపై ఆసక్తికరమైన కామెంట్లు చేసింది. ప్రస్తుతం ఈ కామెంట్లు ఫిలిం సర్కిల్స్ లో వైరల్ అవుతున్నాయి.

    తాను ఇప్పుడు మాత్రమే పాన్ ఇండియా స్టార్ గా ఎదగలేదని.. పదకొండేళ్ల క్రితమే పాన్ ఇండియా స్టార్ ను అని తెలిపింది. తాను 2009లో బాలీవుడ్ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాను అని తెలిపింది. అప్పుడు సోషల్ మీడియా పెద్దగా వాడకంలో లేదని.. ఓటీటీలు కూడా లేవని.. అప్పుడే ఇలా ఉంటే తనకు ఇంకా మంచి పేరు వచ్చి ఉండేదని తెలిపింది శృతి హాసన్. అప్పటి పరిస్థితుల పట్ల కూడా తాను చాలా సంతోషంగా ఉందని తెలిపింది. అయితే పదకొండేళ్ల క్రితమే తాను పాన్ ఇండియా స్టార్ అని ఇప్పుడు ఇంటర్య్వూ చూస్తే అర్థం అవుతుందంటూ తెలిపింది.

    అప్పుడే తాను పాన్ ఇండియా అనే పదాన్ని వాడిందట. అందుకే తనకు పాన్ ఇండియాపై ఇంట్రెస్ట్ లేదని.. తాను అన్ని భాషల్లో సినిమాలు చేసానని.. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్స్ అని చెప్పుకునే హీరోయిన్స్ తో తనను పోల్చవద్దని తెలిపింది శృతి హాసన్. కొన్నేళ్ల క్రితమే పాన్ ఇండియా స్టార్ అయినా శృతిహాసన్.. డిఫరెంట్ సినిమాలు చేస్తుందని.. అందుకే తనను ఎవరితో పోల్చడం తనకు నచ్చదని తేల్చి చెప్పింది ఈ బ్యూటీ.