Vijay Deverakonda vs Rashmika Net Worth: ‘పెళ్లిచూపులు’ సినిమాతో హీరోగా పరిచయమైన విజయ్ దేవరకొండ ఈ సినిమాతో సూపర్ సక్సెస్ ను సాధించాడు. ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో తనకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ చేసుకున్న విజయ్ ఆ తర్వాత నుంచి వెను తిరిగి చూడలేదు. ‘గీత గోవిందం’ సినిమాలో రష్మిక మందాన తో కలిసి నటించాడు. వీళ్లిద్దరి కాంబినేషన్ కి మంచి గుర్తింపు రావడం ఆన్ స్క్రీన్ వీళ్ళ కెమిస్ట్రీ కూడా బాగా వర్కౌట్ అయింది. ఇక ఆ సినిమా సమయంలోనే వీళ్లిద్దరూ ప్రేమలో పడ్డారు. అయినప్పటికి ఇప్పటి వరకు వీళ్ళు ఎక్కడ కూడా వాళ్ళ పెళ్లికి సంబంధించిన విషయాన్ని బయటకి చెప్పకుండా చాలా జాగ్రత్త పడ్డారు. మొత్తానికైతే ఫిబ్రవరి 26 వ తేదీన వీళ్ళ పెళ్లి ఉందంటూ విజయ్, రష్మిక ఇద్దరు ఈ విషయం గురించి మాట్లాడడంతో మరోసారి వీళ్ళు సోషల్ మీడియాలో హైలెట్ అవుతున్నారు. ఇక ఏది ఏమైనా కూడా విజయ్ దేవరకొండ సంపాదించిన ఆస్తుల కంటే రష్మిక మందాన దగ్గరే ఎక్కువగా ఆస్తులు ఉన్నాయని పలువురు సినిమా మేధావులు చెబుతున్నారు. నిజానికైతే విజయ్ దేవరకొండ చేసిన సినిమాలు ఈ మధ్యకాలంలో పెద్దగా ఆడడం లేదు. దాంతో ఆయన కేవలం 10 కోట్ల వరకు మాత్రమే రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు అంటూ కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.
గత సంవత్సరం వచ్చిన ‘కింగ్ డమ్’ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించినప్పటికి ఆయన ప్రస్తుతం రెండు సినిమాలకైతే కమిట్ అయ్యాడు. ఈ రెండు సినిమాలతో మరోసారి ప్రేక్షకులను మెప్పించాలనే ప్రయత్నం చేస్తున్నాడు. విజయ్ దేవరకొండ వద్ద ప్రస్తుతం 200 కోట్ల వరకు ఆస్తులైతే ఉన్నాయట.
ఇక రష్మిక మందాన దగ్గర 300 కోట్ల వరకు ఆస్తులు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక ఏది ఏమైనా కూడా రష్మిక సినిమాలు తో పాటుగా బిజినెస్ లలో కూడా ఎక్కువ లాభాలను సంపాదిస్తుందని అందువల్లే ఆమె దగ్గర ఎక్కువ డబ్బులు ఉన్నాయని పలువురు సినిమా మేధావులు సైతం కామెంట్స్ చేస్తున్నారు…
ఇక వీళ్లిద్దరి కాంబినేషన్లో ఇప్పటికే గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ అనే సినిమాలైతే వచ్చాయి… ప్రస్తుతం రాహుల్ సంకృత్యాయన్ దర్శకత్వంలో ‘రణబలి’ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమాతో ఎలాంటి సక్సెస్ ని సాధిస్తారు అనేది తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…