Ram Charan: రాజకీయాలు, సినిమా జనాలను బాగా ప్రభావితం చేసే అంశాలు. ఈ రంగాల్లో రాణించే వారికి డై హార్డ్ ఫ్యాన్స్ ఉంటారు. వారి కోసం ఎంతకైనా తెగిస్తారు. రాజకీయ, సినీ వారసత్వం కోరుకుంటారు. స్టార్ హీరో కొడుకు స్టార్ హీరో అవ్వాలని అనుకుంటారు. టాలీవుడ్ లో ఈ సాంప్రదాయం మరింత బలంగా ఉంది. తెలుగులో మెగా కుటుంబం గురించి చెప్పాల్సిన అవసరం లేదు. చిరంజీవి నిర్మించిన సినీ సామ్రాజ్యంలో అరడజనుకు పైగా హీరోలు ఎదిగారు. పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్ టాప్ స్టార్స్ గా అవతరించారు. తెలుగు చిత్ర పరిశ్రమను ఈ కుటుంబం శాసిస్తుంది.
మరి వీరందరి ఎదుగుదలకు పునాది వేసిన చిరంజీవి వారసుడిగా రామ్ చరణ్ గ్లోబల్ హీరో అయ్యాడు. ఆర్ ఆర్ ఆర్ మూవీతో ఆయన ఫేమ్ వరల్డ్ వైడ్ అయ్యింది. మరి అలాంటి రామ్ చరణ్ కి వారసుడు కావాలని కోరుకోవడం సహజం. పవన్ కళ్యాణ్ కి ఇద్దరు కొడుకులు ఉన్నారు. రామ్ చరణ్ మాత్రం పదేళ్ల తర్వాత ఫ్యామిలీ ప్లానింగ్ చేశారు. జూన్ 20న రామ్ చరణ్ భార్య ఉపాసనకి పండంటి ఆడబిడ్డ పుట్టింది. రామ్ చరణ్ తండ్రి అయ్యాడనే ఆనందంలో అందరిలో నెలకొంది.
అయితే అబ్బాయి పుట్టలేదన్న నిరాశ మాత్రం ఫ్యాన్స్ లో ఉంది. వారు చిరంజీవి, రామ్ చరణ్ ల నట వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లే అబ్బాయి పుట్టాలని గట్టిగా కోరుకున్నారు. ఆశపడ్డారు. అయితే వారి ఆశలు అడి ఆశలు అయ్యాయి. చిరంజీవికి ఒక్క మనవడు లేకపోవడం విశేషం. ఇద్దరు కూతుళ్ళకు అమ్మాయిలే పుట్టారు. ఇప్పుడు కొడుకుకు కూడా అమ్మాయి పుట్టింది.
అసలు మెగా కుటుంబంలో వారసులు పుట్టారా? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఆ మధ్య చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత రామ్ చరణ్ కి అబ్బాయి పుడితే బాగుండు అన్నారు. ఎవరు పుట్టినా ఓకే, అయితే అబ్బాయి పుడితే ఇంకా ఆనందం. మా ఫ్యామిలీలో ఇప్పటికే నలుగురు అమ్మాయిలు ఉన్నారు. కనీసం రామ్ చరణ్ కి అబ్బాయిపుడితే ఆ ముచ్చట కూడా తీరుతుంది, అన్నారు. అయితే మెగా ఫ్యామిలీతో పాటు ఫ్యాన్స్ కోరిక తీరలేదు. మరి రెండో సంతానమైన రామ్ చరణ్ అబ్బాయికి జన్మనివ్వాలని కోరుకుంటున్నారు.