Rajinikanth: సూపర్ స్టార్ రజినీకాంత్ వయసు ప్రస్తుతం 70 ఏళ్ళు. 70వ వడిలోకి అడుగుపెట్టి కూడా నెలలు గడుస్తోంది. అయితే, రజినీ ఆరోగ్యం కూడా ఈ మధ్య కాస్త అదుపులో లేదు అంటూ పుకార్లు వినిపిస్తున్నాయి. అనారోగ్య సమస్యలతోనే అన్నాత్తే సినిమా చేశాడు. నిజానికి ఆ మధ్య ఇక రజినీ చివరి చిత్రం అన్నాత్తే అవుతుందని అంతా భావించారు. అప్పట్లో రాజకీయాల్లోకి కూడా వెళ్తాను అంటూ రజినీ ప్రకటించాడు కాబట్టి, అప్పుడు ఆ రూమర్ వినిపించింది.

కానీ, చివరకు రజినీ, రాజకీయాల్లోకి రాకూడదు అని నిర్ణయించుకున్నాడు. అందుకే, తానూ ఒకప్పుడు సినిమాలకు పూర్తిగా దూరమవ్వాలని తీసుకున్న నిర్ణయాన్ని కూడా వెనక్కి తీసుకున్నారు. ప్రస్తుతం వరుస సినిమాలు చేయాలని రజినీ ప్లాన్ చేస్తున్నారు. కానీ రజిని ఆరోగ్య కారణాల రీత్యా ఇక ఆయన సినిమాలు చేయకుండా ఉండటమే మంచిది అనే అభిప్రాయానికి వచ్చారు.
కాకపోతే రజిని మాత్రం ఎట్టిపరిస్థితిల్లో సినిమాలు చేయాలనే దృఢ నిశ్చయంతో ఉన్నాడు. అసలు అన్నాత్తే సినిమానే రజిని అతి కష్టంమీద పూర్తి చేయాల్సి వచ్చింది. అలాంటప్పుడు ఎందుకు మళ్లీ సినిమాలు చేయడం ? అన్నాత్తే సినిమా షూటింగ్ లో ఉండగానే రజినీకాంత్ ఆరోగ్యం బాగా దెబ్బతినడంతో పాటు ఆయనను ఆసుపత్రికి కూడా పంపింది.
హాస్పిటల్ నుంచి వచ్చాక కొన్నాళ్ల పాటు విశ్రాంతి తీసుకుని రజిని ఆ సినిమా ఫినిష్ చేశాడు. అంతకష్ట పడి సినిమా చేసినా.. ఆ సినిమా కంటెంట్ పై విమర్శలు ఎదురయ్యాయి. అలాగే కలెక్షన్స్ కూడా జస్ట్ పర్వాలేదనిపించాయి తప్ప.. అంత గొప్పగా ఏమి రాలేదు. మరి ఈ పరిస్థితుల్లో రజిని మరో సినిమా చేయడం అవసరమా ?
Also Read: Celebrities: పెళ్లి పెటాకులు చేసుకున్న హీరోహీరోయిన్లు !
ఇప్పటికే సూపర్ స్టార్ రజినీకాంత్ తర్వాత సినిమా అది అంటూ ఇది అంటూ వార్తలు వస్తున్నాయి. సాధారణంగా ఒక సినిమా సెట్స్ పై ఉండగానే మరో సినిమా చేయడం రజినీకి బాగా అలవాటు. ఇప్పుడు ఆ అలవాటు ప్రకారమే చేసుకుంటూ పోవాలని రజిని కూడా బాగా ఆరాటపడుతున్నాడు. కాకపోతే సూపర్ స్టార్ రిటైర్ అవ్వడం అయన ఆరోగ్యానికి మంచిది.
Also Read: Vijay Setupathi: సేతుపతిపై దాడి చేస్తే రివార్డు ప్రకటంచిన హిందూవాదిపై పోలీసులు కేసు నమోదు