Homeఎంటర్టైన్మెంట్Rajamouli 1300 crore budget: రాజమౌళి ప్లాన్ ఎవ్వరికి అర్థం కావడం లేదా..? 1300 కోట్ల...

Rajamouli 1300 crore budget: రాజమౌళి ప్లాన్ ఎవ్వరికి అర్థం కావడం లేదా..? 1300 కోట్ల బడ్జెట్ రికవరీ అవుతుందా..?

Rajamouli 1300 crore budget: ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శక ధీరుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటి క్రియేట్ చేసుకున్న దర్శకుడు రాజమౌళి… ఆయన నుంచి వచ్చిన ప్రతి సినిమా ప్రేక్షకులను అలరిస్తుంది. ప్రస్తుతం ఆయన మహేష్ బాబుతో ‘వారణాసి’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో ఎలాగైనా సరే భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకోవాలనే ధృడ సంకల్పంతో ముందుకు సాగుతున్నాడు. 1300 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా 3000 కోట్లకు పైన కలెక్షన్స్ ను రాబడుతుందనే అంచనాలో మహేష్ బాబు, రాజమౌళి అయితే ఉన్నారు… ప్రస్తుతం సినిమా టికెట్లు రేటు పెంచుతుంటే ప్రేక్షకుడి థియేటర్ కి రావడం లేదనే గొడవ మొదలవుతుంది. ఇక ఇలాంటి సందర్భంలో రాజమౌళి 1300 కోట్ల బడ్జెట్ తో సినిమాని తీస్తే ఆ సినిమా టికెట్ రేట్ ఎంత పెట్టాలి. దానివల్ల సామాన్యుల మీద చాలా వరకు భారం పడే అవకాశమైతే ఉంది. అంటూ మరి కొంతమంది కామెంట్ చేస్తున్నారు.

ఇక ఏది ఏమైనా కూడా రాజమౌళి సినిమాని చూడాలనే కుతుహులం ప్రేక్షకుల్లో కలిగించేలా అతను ట్రైలర్ కట్ చేస్తాడు. ఇక దానికి తోడుగా అంచనాలను తారా స్థాయికి పెంచేస్తాడు. కాబట్టి ప్రేక్షకులు సైతం ఆ సినిమా కోసం ఎన్ని డబ్బులు అయినా పెట్టొచ్చు అనే ధోరణిలో ఆలోచిస్తారు…

అందుకే రాజమౌళి సినిమా విషయంలో భారీ కలెక్షన్స్ వస్తాయని ఒక దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నాడు. మరితను అనుకున్నట్టుగానే ఈ సినిమా టాప్ రేంజ్ లో ముందుకు దూసుకెళ్తుందా? రాజమౌళి పేరును మరోసారి ప్రపంచవ్యాప్తంగా వినిపించేలా చేస్తుందా? లేదా అనేది తెలియాల్సి ఉంది. మొత్తానికైతే రాజమౌళి సినిమా విషయంలో ఒక స్ట్రాటజీ ని వాడుతున్నాడు.

ట్రైలర్ ను అద్భుతంగా కట్ చేసి ప్రేక్షకుల్లో కుతూహలాన్ని రేకెత్తించి సినిమా థియేటర్ కె మొదటి రోజే ప్రతి ప్రేక్షకుడు వచ్చి సినిమా చూసేలా ప్రేరేపిస్తున్నాడు… ఇక ఏది ఏమైనా కూడా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని శాసించగలిగే కెపాసిటి ఉన్న దర్శకులలో రాజమౌళి మొదటి స్థానంలో ఉన్నాడు…

 

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version