https://oktelugu.com/

Janhvi Kapoor: రాత్రి అవి చూడకపోతే దేవర బ్యూటీకి నిద్ర పట్టదట.. సీక్రెట్‌ చెప్పిన జాన్వీ కపూర్‌!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో అతిలోకసుందరిగా పేరు తెచ్చుకున్న దివంగత శ్రీదేవి కూతురు జాన్వికపూర్‌ ఇన్నాళ్లకు తెలుగు సినిమా రంగంలో కూడా అడుగుపెడుతుంది.

Written By: , Updated On : October 3, 2023 / 01:10 PM IST
Janhvi Kapoor

Janhvi Kapoor

Follow us on

Janhvi Kapoor: తినే తిండి.. తాగే పానీయాలు.. మానసిక ఒత్తిడి.. కాలుష్యం, వర్క్‌ టెన్షన్‌.. చేసే పనిలో సక్సెస్, ఫెల్యూర్‌ ఇలా అనేక అంశాలు మనిషిని నిద్రకు దూరం చేస్తున్నాయి. వయసుతో సంబంధం లేకుండా అందరూ నిద్రలేమి సమస్య ఎదుర్కొంటున్నారు. దీంతో రాత్రిళ్లు మెలకువగా ఉండి.. తెల్లవారు జామున నిద్రలోకి జారుకుంటున్నారు. పొద్దెక్కే వరకు మేల్కోవడం లేదు. దీంతో జీవన శైలి దెబ్బతింటోంది. అనేక అనారోగ్య సమస్యలకు దారితీస్తోంది. ఇక ఉద్యోగులు అయితే పనిచేయాల్సిన టైంలో కునుకు తీస్తున్నారు. ఇక ఇంటర్నెట్, ఆన్‌డ్రాయిడ్‌ ఫోన్‌ చౌకగా అందుబాటులోకి వచ్చాక చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ రాత్రి బెడ్‌ ఎక్కిన తర్వాత ఫోన్లు చూస్తూ గంటలు గంటలు గడిపేస్తున్నారు. ఈ కారణంగా మనిషి ఆరోగ్య పరిస్థితుల్లో చాలా మార్పులు వచ్చేస్తున్నాయి. సామాన్యులే నిద్రలేమితో మాట్లాడుతుంటే.. సెలబ్రిటీలు, ముఖ్యంగా సినిమా నటుల్లో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది. అందుకే వారు డ్రగ్‌ ఎడిక్ట్‌గా మారుతున్నారన్న అభిప్రాయం కూడా ఉంది. అయితే దేవర బ్యూటీ జాన్వికపూర్‌ మాత్రం రాత్రి నిద్ర రాకుంటే తాను చేసే పనిని బయటపెట్టింది.

అతిలోక సుందరి కూతురుగా..
తెలుగు సినిమా ఇండస్ట్రీలో అతిలోకసుందరిగా పేరు తెచ్చుకున్న దివంగత శ్రీదేవి కూతురు జాన్వికపూర్‌ ఇన్నాళ్లకు తెలుగు సినిమా రంగంలో కూడా అడుగుపెడుతుంది. ఈమె బాలీవుడ్‌లో ఒక క్రేజ్‌ క్రియేట్‌ చేసుకుని.. తన అందంతో అలరిస్తూ మంచి పేరు తెచ్చుకున్న జాన్వీ.. ఇప్పుడు తెలుగులో కూడా అడుగుపెడుతుంది. జూనియర్‌ ఎన్టీఆర్‌ సరసన మొదటిసారిగా తెలుగులో నటిస్తోంది. కొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే సినిమాలో జాన్వీ హీరోయిన్‌గా నటిస్తోంది.

తలుపు తడుతున్న ఆఫర్లు..
ఎప్పుడైతే జాన్వి కపూర్‌ తెలుగులో నటించేందుకు ముందుకు వచ్చిందో.. అప్పటినుంచి ఆఫర్లు ఆమె తలుపు తడుతున్నాయి. స్టార్‌ హీరోల సరసన నటించాలని నిర్మాతలు, దర్శకులు సంద్రిస్తున్నారు. దేవర సినిమా రిలీజ్‌ కాకముందే ఆమె నటన ప్రభావం ఎలా ఉందో చూడకముందే ఆమెకు అంత క్రేజ్‌ క్రియేట్‌ అవ్వడం నిజంగా గ్రేట్‌. జాన్వీకపూర్‌ నెక్ట్స్‌ తెలుగు సినిమా ఎవరితో అనేది ఇంతవరకు డిసైడ్‌ అవ్వలేదు.

నిద్ర రాకుంటే మాత్రం..
అయితే అందరిలాగే జాన్వీ కూడా అప్పుడప్పుడు నిద్ర సమస్యతో బాధపడుతుందట. ఈ విషయాన్ని ఆమే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. అందులో తన పర్సనల్‌ విషయాలు చెబుతూ.. తన తల్లి శ్రీదేవి ఇప్పటికీ తనతో ఉన్నట్టే ఫీలింగ్‌ ఉంటుందని.. పడుకునే ముందు గుడ్‌ నైట్‌ చెప్తానని, లేవగానే గుడ్‌ మార్నింగ్‌ చెప్తానని చెప్పింది. దీనితో ఆమెకు తల్లితో ఉన్న బంధం, ప్రేమ ఎంతటిదో అందరికీ తెలుస్తుంది. అంతేకాకుండా తన చెల్లెలు ఖుషి కపూర్‌ని సరదాగా ఏడిపించడం అంటే తనకి చాలా ఇష్టమని చెప్పుకొచ్చింది. ఇది ఇలా ఉంటే తనకి నైట్‌ టైం నిద్ర రాకపోతే ఫోన్లో వీడియోలు చూస్తానని చెప్పింది. రాత్రివేళ అందరూ పడుకున్న తర్వాత ఆమెకు నిద్ర రాకపోవడమేంటి? రాకపోతే వీడియోలు చూడటం ఏంటి? ఈ వయసులో ఎలాంటి వీడియోలు చూస్తుంది? అని అందరు అనుకున్నారు. ఇంతకీ జాన్వీ కపూర్‌ చూసే వీడియోస్‌ ఏమిటంటే టామ్‌ అండ్‌ జెర్రీ అంట. ఇంకా చిన్న పిల్లల టామ్‌ అండ్‌ జెర్రీ వీడియోస్‌ చూస్తూ పడుకుంటుందని తెలిసి అభిమానులు అందరూ నవ్వుకుంటున్నారు.