https://oktelugu.com/

Allu Arjun: అల్లు అర్జున్ కి పాకిస్థాన్ లో కూడా ఫ్యాన్స్ ఉన్నారా..? ఆయన వల్లే తండేల్ మూవీ తెరకెక్కిందా..?

సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోలు వాళ్ళు చేస్తున్న సినిమాల ద్వారా చాలామంది ప్రేక్షకులను వాళ్ళ అభిమానులుగా మార్చుకుంటూ ఉంటారు. నిజానికి ఏదైనా సినిమా బాగుంటే అందులో ఉన్న నటీనటులను చాలామంది ప్రేక్షకులు అభిమానిస్తూ ఉంటారు. అదేవిధంగా మన తెలుగు హీరోలకి కూడా ఇతర దేశాల్లో అభిమానులు ఉన్నారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు...

Written By:
  • Gopi
  • , Updated On : February 9, 2025 / 12:13 PM IST
    Allu Arjun

    Allu Arjun

    Follow us on

    Allu Arjun: తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వాళ్ళకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నారు… ఇక ఇలాంటి సందర్భంలోనే అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరో సైతం తనను తాను స్టార్ గా ఎస్టాబ్లిష్ చేసుకోవడమే కాకుండా ‘పుష్ప 2’ (Pushpa 2)సినిమాతో 1900 కోట్ల కలెక్షన్లను రాబట్టాడు. మరి ఏది ఏమైనా కూడా ఆయనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవడంలో సక్సెస్ అయ్యాడు. ఇక ఇదిలా ఉంటే అల్లు అర్జున్(Allu Arjun) కి ఇండియాలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా పాకిస్తాన్ లాంటి దేశంలో అల్లు అర్జున్ కి చాలా మంది అభిమానులు ఉన్నారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…ఇక అల్లు అర్జున్ వల్లే తండేల్ (Thandel) సినిమా మొదలైంది. ఆయన వల్లే ఆ సినిమా తెరకెక్కిందనే విషయం మనలో చాలామందికి తెలియదు…శ్రీకాకుళం జిల్లాలో జరిగిన ఒక ఒరిజినల్ కథ ఆధారంగా తెరకెక్కింది. అయితే ‘తండేల్ రామారావు’ అనే వ్యక్తి తో పాటు 22 మందిని పాకిస్తాన్ పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత అక్కడ ఒక జైలర్ వీళ్ళతో బాగా మాట్లాడుతూ తండేల్ రామారావుతో మీరు ఇండియాకు వెళ్లిన తర్వాత నాకు అల్లు అర్జున్ నుంచి ఒక ఆటోగ్రాఫ్ కావాలి నేను అతనికి వీరాభిమాని అని చెప్పాడట. జైల్లో ఉన్నప్పుడు వాళ్లకు చాలా బాగా హెల్ప్ చేసిన ఆ జైలర్ యొక్క కోరికను తీర్చాలనే ఉద్దేశ్యం తో కార్తీక్ అనే రైటర్ తో అల్లు అర్జున్ ని కలిసి అతనికి పాకిస్తాన్ లో కూడా అభిమానులు ఉన్నారని చెప్పాలని అనుకున్నారట.

    ఇక కార్తీక్ అనే రైటర్ అల్లు అర్జున్ ను కలవడానికి గీతా ఆర్ట్స్ కి వెళ్ళాడు. ఇక ఈ క్రమంలోనే బన్నీ వాసుని కలవడం కథ గురించి చెప్పడంతో కథ బావుంది అని బన్నీ వాసు అల్లు అరవింద్ కి చెప్పి ఆ కథను సినిమాగా తెరకెక్కించే ప్రయత్నం చేశారు.

    ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన తండేల్ సినిమా పాజిటివ్ టాక్ ను సంపాదించుకొని ముందుకు దూసుకెళ్తుంది. ఇక మొత్తానికైతే అల్లు అర్జున్ వల్లే ఈ తండేల్ సినిమా మెటీరియలైజ్ అయింది.

    ఇక తన వల్లే ఈ సినిమాను చేశాము అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదని సినిమా యూనిట్ కూడా చెబుతున్నారు. మరి అల్లు అర్జున్ క్రేజ్ అనేది అంతలా పెరిగిపోయిందా పాకిస్తాన్ లో కూడా అతనికి వీరాభిమానాలు ఉన్నారా అని చాలామంది ఆశ్చర్యపోతున్నారు. ఇక రీసెంట్ గా ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది…