Photo Story: అమ్మ ఒడిలో కూర్చుని ఇన్నోసెంట్ ఎక్స్ప్రెషన్ ఈ చిన్న ఈ అమ్మాయి ఓ హీరోయిన్. హైదరాబాద్ లు పుట్టింది. మణిరత్నం వంటి దర్శకులతో పని చేసింది. ఇటీవల ఓ క్రేజీ హీరోని ఆమె పెళ్లాడారు. ఇప్పటికే మీకు ఒక ఐడియా వచ్చి ఉండొచ్చు. ఆ ఫోటోలోని పాప ఎవరో కాదు… అదితి రావు హైదరి. 2006లో అదితి రావు హైదరి ప్రస్థానం మొదలైంది. మమ్ముట్టి హీరోగా నటించిన ప్రస్థానం చిత్రంలో అదితి రావు హైదరి నటించారు. అనంతరం ఓ తమిళ చిత్రం చేసింది.
బాలీవుడ్ కి షిఫ్ట్ అయిన అదితిరావు హైదరి అక్కడ వరుస చిత్రాలు చేసింది. ఢిల్లీ, దోబీ ఘాట్, రాక్ స్టార్ తో పాటు అనేక విజయవంతమైన చిత్రాల్లో అదితి రావు హైదరి నటించారు. ఇక తెలుగులో సమ్మోహం ఆమె మొదటి చిత్రం. దర్శకుడు ఇంద్రగంటి మోహన కృష్ణ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సుధీర్ బాబు హీరోగా నటించారు. అంతరిక్షం, వి, మహాసముద్రం చిత్రాల్లో అదితి రావు నటించి మెప్పించారు. అయితే ఆమెకు విజయాలు దక్కలేదు. దాంతో టాలీవుడ్ ఆమెను పట్టించుకోలేదు.
మణిరత్నం తెరకెక్కించిన చెలియా మూవీలో అదితి రావు హైదరి నటించిన సంగతి తెలిసిందే. రొమాంటిక్ లవ్ డ్రామాగా తెరకెక్కింది. కార్తీ హీరోగా చేశారు. తెలుగు, తమిళ భాషల్లో విడుదలైన ఈ చిత్రం ఆశించిన స్థాయిలో ఆడలేదు. కాగా అదితిరావు హైదరి ఇటీవల హీరో సిద్ధార్థ్ ను వివాహం చేసుకుంది. కొన్నాళ్లుగా రిలేషన్ లో ఉన్న ఈ జంట పెళ్లి బంధంలో అడుగుపెట్టారు.
అదితి రావుకు సిద్ధార్థ్ తో రెండో వివాహం. 2002లో సత్యదీప్ మిశ్రా అనే వ్యక్తిని అదితి వివాహం చేసుకుంది. ఇది రహస్య వివాహం అని సమాచారం. అయితే పెళ్ళైన కొద్దిరోజులకే విడిపోయారట. సిద్ధార్థతో కొత్త జీవితం ఆరంభించింది. సిద్ధార్థ్ కి కూడా గతంలో వివాహం జరిగింది. ఇది ఆయనకు కూడా రెండో వివాహం. అదితిరావు ప్రస్తుతం రెండు చిత్రాలు చేస్తుంది.
Web Title: Do you remember who this heroine is who got married secretly got divorced and married a crazy hero at a young age
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com