Thammudu Movie Heroine: చేసింది తక్కువ చిత్రాలే అయినా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ముద్ర వేసింది ప్రీతి ఝంగియానీ. ఈ ముంబై భామ తమ్ముడు మూవీతో సిల్వర్ స్క్రీన్ కి పరిచయమైంది. రొమాంటిక్ లవ్ అండ్ స్పోర్ట్స్ డ్రామాగా తమ్ముడు తెరకెక్కింది. తమ్ముడు మూవీలో హోమ్లీ హీరోయిన్ గా తన క్యూట్ లుక్స్ తో ఆకట్టుకుంది. తమ్ముడు సూపర్ హిట్ కావడంతో ప్రీతి ఫేమ్ రాబట్టింది. తెలుగులో ప్రీతి రెండో చిత్రం నరసింహ నాయుడు. బాలకృష్ణ హీరోగా దర్శకుడు బి. గోపాల్ తెరకెక్కించిన నరసింహనాయుడు ఇండస్ట్రీ హిట్ కొట్టింది.
ఆమె మూడో చిత్రం అధిపతి ప్లాప్. దాంతో ఓ రెండేళ్లు టాలీవుడ్ కి దూరమైంది. రీఎంట్రీ రాజేంద్రప్రసాద్ వంటి ఫేడ్ అవుట్ హీరోతో మూవీ చేసింది. దాంతో ఆమె కెరీర్ ఢమాల్ అంది. రాజమౌళి-ఎన్టీఆర్ ల హ్యాట్రిక్ మూవీ యమదొంగ చిత్రంలో ఐటెం సాంగ్ చేసింది. తెలుగులో ప్రీతి చివరి చిత్రం తేజం. ఇది 2010లో విడుదలైంది. 2013 వరకు హిందీ, పంజాబీ, బెంగాలీ, కన్నడ చిత్రాల్లో ప్రీతి నటించింది.
బాలీవుడ్ నటుడు నిర్మాత ప్రవాన్ దాస్ తో ప్రేమలో పడిన ప్రీతి… కొన్నాళ్ళు డేటింగ్ చేసింది. 2008లో వీరికి వివాహం జరిగింది. పెళ్ళైన మూడేళ్లకు 2011లో మొదటి కొడుకు జైవీర్ జన్మించాడు. 2016లో రెండో చైల్డ్ దేవ్ జన్మించాడు. ప్రీతి అందమైన మ్యారీడ్ లైఫ్ అనుభవిస్తుంది.
చాలా గ్యాప్ తర్వాత ప్రీతి డిజిటల్ సిరీస్లో నటించింది. సోనీ లైవ్ లో స్ట్రీమ్ అవుతున్న ‘కఫాస్ అనే డ్రామాలో నటించింది. ఈ సిరీస్లో ఆమె కీలక రోల్ చేసింది. వెండితెరకు దూరమైన ప్రీతి సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కి అందుబాటులో ఉంటుంది. 43 ఏళ్ల ప్రీతి ఇప్పటికీ సన్నజాజి తీగలా ఉంది. అయితే ఒకప్పటి గ్లామర్ అయ్యితే మిస్ అయ్యింది. ప్రీతి లేటెస్ట్ లుక్ చూసి అప్పటి ఆమె అభిమానులు షాక్ అవుతున్నారు.