Vinaya Vidheya Rama Child Artist: ‘రంగస్థలం’ లాంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత రామ్ చరణ్ నటించిన చిత్రం ‘వినయ విధేయ రామ’. బోయపాటి శ్రీను దర్శకత్వం లో తెరకెక్కిన ఈ చిత్రం భారీ అంచనాల నడుమ విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఇక ఇందులోని చాలా సన్నివేశాలు సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో ట్రోల్ అయ్యాయి. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ చిన్నప్పటి క్యారక్టర్ చేసిన బుడ్డోడు కూడా అప్పట్లో బాగా ఫేమస్ అయ్యాడు.
ఎవరు ఈ పిల్లోడు, చాలా విచిత్రం గా ఉన్నాడే, బోయపాటి శ్రీను ఇలాంటోళ్లను భలే వెతికి పట్టుకొస్తాడు అని అప్పట్లో అందరూ మాట్లాడుకుంటారు. ముఖ్యంగా ఈ బుడ్డోడు ‘అన్నయ్యలు చదువుకుంటారు..నేను పని చేస్తాను’ అంటూ చెప్పిన ఒక డైలాగ్ మీద అప్పట్లో మీమ్స్ కూడా వచ్చాయి. ఇక ఈ బుడ్డోడు పేరు ఏమిటంటే రోషన్ రాయ్. ‘వినయ విధేయ రామ’ చిత్రం విడుదలై నాలుగు సంవత్సరాలు దాటిపోయింది, ఇప్పుడు ఈ బుడ్డోడు కూడా బాగా ఎదిగిపోయాడు.
అయితే ఈ పిల్లోడు అసలు ఎవరు, ఏమిటి అని ఆరాలు తియ్యగా, ఇతను బోయపాటి శ్రీను కజిన్ కొడుకు అట. కెమెరా ముందు కనిపించాలనే ఆత్రుత ఈ కుర్రాడిలో బాగా ఉండేదట, అందుకే స్కూల్ సెలవు దినాలలో ‘వినయ విధేయ రామ’ చిత్రం లో నటింపచేసాడట. ఈ చిత్రం ఫ్లాప్ అయ్యినప్పటికీ కూడా ఈ బుడ్డోడికి అవకాశాలు వస్తూనే ఉన్నాయి.
రీసెంట్ గానే ఈ బుడ్డోడు జీ తెలుగు లో అత్యధిక టీఆర్ఫీ రేటింగ్స్ తో ముందుకు దూసుకుపోయిన ‘కల్యాణ వైభోగమే’ అనే సీరియల్ లో ‘చారుకేశి’ అనే పాత్ర చేసాడు. ఆ పాత్ర కి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. ఈ సీరియల్ తో పాటు టాలీవుడ్ లో పలు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా చేస్తున్నాడు. ఈ చిన్న కుర్రాడు, బోయపాటి శ్రీను కి బంధువు అవుతాడనే విషయం టాలీవుడ్ లో ఎవరికీ కూడా తెలియకపోవడం విశేషం.