Chiranjeevi- Balakrishna: నిన్నటి తరం హీరోలలో బాక్స్ ఆఫీస్ వద్ద నువ్వా నేనా అనే రేంజ్ లో తలపడిన హీరోలు ఎవరు అంటే అందరూ కళ్ళు మూసుకొని చెప్పే పేర్లు చిరంజీవి మరియు బాలకృష్ణ. ఈ ఇద్దరి హీరోల సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద పోటీపడుతాయి కానీ, వ్యక్తిగతంగా వీళ్ళు మంచి స్నేహితులు. ఎన్నో సందర్భాలలో ఒకరి గురించి ఒకరు మంచిగా మాట్లాడుకున్న సందర్భాలు ఉన్నాయి. కానీ బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ విషయం లో మాత్రం అసలు తగ్గరు ఈ ఇరువురి హీరోలు.
ఈ ఏడాది లో మెగాస్టార్ చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ మరియు బాలకృష్ణ ‘వీర సింహా రెడ్డి’ సంక్రాంతికి పోటీ పడ్డారు. రెండు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి కానీ, ‘వాల్తేరు వీరయ్య’ చిత్రానికి అత్యధిక వసూళ్లు వచ్చాయి. అలా వీళ్ళ మధ్య ఏకంగా 15 సార్లు బాక్స్ ఆఫీస్ వార్ జరిగింది, ఒకసారి చిరంజీవి గెలిస్తే, మరో సారి బాలయ్య గెలిచేవాడు, అలా వీళ్ళ మధ్య పోటీ చాలా ఆసక్తికరం గా ఉండేది.
అయితే ఇంత పోటీ తత్త్వం ఉండే వీళ్లిద్దరి సినిమాలు ఒకరికి ఒకరివి బాగా నచ్చినవి కూడా ఉన్నాయి, అలా బాలయ్య బాబు నచ్చిన మెగాస్టార్ చిరంజీవి చిత్రం ఏమిటి అంటే అది ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ అట. ఈ సినిమాని బాలయ్య బాబు కనీసం 20 సార్లు అయినా చూసి ఉంటానని గతం లో జరిగిన ఒక ఇంటర్వ్యూ లో స్వయంగా తెలిపాడు.
ఈ చిత్రం లోని పాటలు, సెట్టింగ్స్ , చిరంజీవి నటన ,శ్రీదేవి అందం ఇలా ప్రతీ ఒక్కటి కూడా తనకి ఎంతగానో నచ్చిందని, ఇది తెలుగు సినిమా ఇండస్ట్రీ చిరస్థాయిగా గుర్తించుకోదగ్గ చిత్రం అని గతం లో బాలయ్య ఈ మాట అన్నాడు. ఇప్పటికీ కూడా ఆయన తీరిక సమయం లో టీవీ లో వచ్చినప్పుడు ఈ చిత్రాన్ని వీక్షించడానికి ఇష్టపడుతాడట. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారింది