Adah Sharma: ఓ హిందీ మూవీతో వెండితెరకు పరిచయమైన ఈ బ్యూటీని, డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ టాలీవుడ్ కి తీసుకొచ్చారు. ఆ సినిమాలో తన అందచందాలతో కుర్రకారుకు హార్ట్ ఎటాక్ తెప్పించిన ఈ బోల్డ్ హీరోయిన్ కి, ఆ సినిమా హిట్ ఇవ్వలేదు. అల్లు అర్జున్ హీరోగా వచ్చిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో సెకండ్ హీరోయిన్ గా ఓ పాత్ర చేసింది. ఆ సినిమా హిట్ టాక్ తెచ్చుకున్నా.. ఈ భామకు బ్రేక్ దక్కలేదు.

అయితే ఓ క్రైమ్ థ్రిల్లర్ తో సూపర్ హిట్ అందుకుంది. ఆ హిట్ తర్వాత క్షణం తీరిక లేని బిజీ హీరోయిన్ అవుతుందనుకున్నారు. అయితే టాలీవుడ్ ఆమెను పట్టించుకోవడం మానేసింది. కొంచెం గ్యాప్ ఇచ్చి సీనియర్ హీరో పక్కన నటించింది. ఆ మూవీ ప్లాప్ కావడంతో టాలీవుడ్ లో ఆమెకు అవకాశాల గేట్లు మూసుకుపోయాయి. ఇప్పటికే మీకు అర్థమయ్యే ఉంటుంది ఆ హీరోయిన్ ఎవరో.

ఎస్, మీ ఊహ నిజమే.. ఇక్కడ మనం మాట్లాడుకుంటుంది ఆదా శర్మ గురించే. 2008లో విడుదలైన హిందీ చిత్రం ‘1920’ తో ఆదా వెండితెరకు పరిచయం అయ్యారు. దర్శకుడు పూరి జగన్నాధ్ ఆమెను టాలీవుడ్ కి దిగుమతి చేసుకున్నాడు. 2014లో నితిన్ హీరోగా ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన హార్ట్ ఎటాక్ మూవీలో ఆదా హీరోయిన్ గా నటించారు. ఆ మూవీ అనుకున్నంత విజయం సాధించలేదు. అనంతరం సన్ ఆఫ్ సత్యమూర్తి మూవీలో సెకండ్ హీరోయిన్ గా త్రివిక్రమ్ ఛాన్స్ ఇచ్చాడు.
Also Read: పుష్ప ఐటెం సాంగ్‌కు ఊ అంటున్న నెటిజన్లు.. భారీ వ్యూస్‌తో ట్రెండింగ్
సన్ ఆఫ్ సత్యమూర్తి మూవీలో ఆదా పాత్రకు ఏమంత ప్రాధాన్యత ఉండదు. సెకండ్ హీరోయిన్ అనడం కూడా సబబు కాదు. దీంతో సన్ ఆఫ్ సత్యమూర్తి సక్సెస్ కొట్టినా.. ఆదాకు ఎటువంటి ప్రయోజనం దక్కలేదు. అడివి శేషు హీరోగా 2016లో వచ్చిన క్షణం మూవీలో ఆదా శర్మ నటించారు. ఈ మూవీ హిట్ టాక్ తెచ్చుకుంది. క్షణం మూవీతో హిట్ దక్కినా.. ఆదాకు అవకాశాలు రాలేదు.
2019లో రాజశేఖర్ హీరోగా దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన కల్కి మూవీలో హీరోయిన్ గా నటించారు. కల్కి ప్లాప్ ఖాతాలో చేరగా ఆదా అవకాశాలకు గండి పడింది. ప్రస్తుతం హిందీలో అడపాదడపా చిత్రాలు చేస్తుంది.
View this post on Instagram
Also Read: అలియా మంచితనమా… రాజమౌళి పట్టుదలా..?