Nandamuri Balakrishna: బాలయ్యను ఇన్నేళ్లు సమాజం తప్పుగా అర్థం చేసుకుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో నెటిజన్లు ఫీల్ అవుతూ చేస్తున్న కామెంట్ ఇది. నిజానికి సినిమా ఇండస్ట్రీలో కూడా బాలయ్య అంటే.. ఒక భయం ఉంది. ఆయన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలే ఆ భయానికి కారణం కావొచ్చు. బాలయ్యకు ప్రేక్షకులకు మధ్య తెలియని గ్యాప్ ఉండేది. అందుకే, బాలయ్య సినిమాలను ప్రేక్షకుల్లో చాలామంది చూసే వాళ్ళు కాదు. ముఖ్యంగా బాలయ్య ప్రవర్తన పై అప్పట్లో అనేక అనుమానాలు ఉండేవి.

సహజంగానే 30 సంవత్సరాల వయసులో బాలయ్య బాబుకు స్టార్ డమ్ వచ్చింది. కష్టం, నష్టం తెలియకుండా పెరిగిన బాల్యం బాలయ్యది. అలాంటప్పుడు ఎవరి ప్రవర్తన అయినా ఎలా ఉంటుంది. అలాగే ఉండేది బాలయ్య ప్రవర్తన కూడా. ఇప్పుడంటే మీడియా ప్రతి సెలెబ్రిటీ వెంటపడి, వాళ్ళు జిమ్ వీడియోల దగ్గర నుంచి వాళ్ళేం చేస్తున్నా.. దాన్ని న్యూస్ చేసి వేసేస్తున్నారు. కానీ అప్పట్లో ఈ దరిద్రం లేదు.
అందుకే, అప్పటి ప్రముఖుల మంచితనం గురించి ప్రేక్షకులకు తెలిసేది కాదు. అదే చెడు జరిగితే ఏ కాలంలోనైనా వెంటనే వైరల్ అవుతుంది. అలా బాలయ్య కోపాన్ని చెడుగా ప్రచారం చేశారు. మంచి మాత్రం బయటకు రాలేదు. ముఖ్యంగా బాలయ్య సేవ గుణం గురించి ఎవరికీ తెలియకుండా పోయింది. బాలయ్య మొదటి నుంచి మంచి సేవా మూర్తి.
Also Read: అఖండలో అందర్నీ ట్రాన్స్‌లోకి తీసుకెళ్లిన ఆ సీన్.. బోయపాటి విజువల్ మెస్మరైజ్
కానీ ఆయనలోని ఆవేశం ఆ మంచి తనాన్ని కప్పేసింది. పైగా బాలయ్యలో మొదటి నుంచి నైతికత ఉంది. ఆయన చేసిన సేవను, ఇచ్చిన దానాన్ని ఒకరికి తెలియాల్సిన అవసరం లేదని భావించేవారు. అందుకే, బాలయ్య గురించి నిజాలు కంటే అబద్ధాలు, అపోహలు ఎక్కువగా ప్రచారంలోకి వచ్చాయి. అయితే, ఆహాలో చేస్తోన్న ‘అన్‌స్టాపబుల్’ షో నుంచి బాలయ్య అంటే ఏమిటో ? అసలు బాలయ్య బయట ఎలా ఉంటారో ? చాలా క్లారిటీగా జనానికి అర్థం అయింది.
నిజంగా ఆహాకి ‘అన్‌స్టాపబుల్’ షో ఎంతగా ప్లస్ అయిందో తెలియదు గాని, ఆ షో మాత్రం బాలయ్యకు బాగా ప్లస్ అయింది. అరె.. బాలయ్య బాబు ఇంత ఓపెన్ గా ఉంటారా ? అసలు బాలయ్యలా ఏ హీరో ఉండదు కదా. ఎంతైనా బాలయ్య గ్రేట్ అనే భావన బలంగా కలుగుతుంది.
Also Read: బాలయ్య – బోయపాటి కాంబో మళ్ళీ రిపీట్ కానుందా…