Photo Story: ఈ ఫోటో లో కనిపిస్తున్న చిన్నారిని ఎవరైనా గుర్తు పట్టారా, ఈమె ఎల్లప్పుడూ సోషల్ మీడియా లో కాంట్రవర్సీ పోస్టులు వేస్తూ సెలబ్రిటీస్ ని ఇబ్బంది పెట్టాలని చూస్తూ ఉంటుంది. కత్తి మహేష్ అప్పట్లో పవన్ కళ్యాణ్ మీద చేసిన ఆరోపణల్లో భాగంగా ఎన్నో నాటకాలు వేసాడు. ఆ నాటకాల్లో ఈమె కూడా ఒక చిన్న పాత్ర పోషించిందని అందరూ అంటూ ఉంటారు, ఆమె మరెవరో కాదు పూనమ్ కౌర్.
ఈమె హైదరాబాద్ లోనే పుట్టి పెరిగిన అమ్మాయి, అప్పట్లో ఎస్ వీ కృష్ణ రెడ్డి మరియు శ్రీకాంత్ కాంబినేషన్ లో వచ్చిన ‘మాయాజాలం’ అనే చిత్రం ద్వారా హీరోయిన్ గా ఈమె ఇండస్ట్రీ కి పరిచయం అయ్యింది. ఆ సినిమా సూపర్ హిట్ అయిన తర్వాత ఈమెకి హీరోయిన్ రోల్స్ వస్తాయని కలలు కనింది, రెండు మూడు సినిమాల్లో హీరోయిన్ గా చేసింది కూడా, కానీ ఆ చిత్రాలు ఎప్పుడొచ్చాయో ఎప్పుడు వెళ్ళాయో కూడా ప్రేక్షకులకు తెలియదు.

దీనితో ఈమెకి సినిమా అవకాశాలు అయితే వచ్చాయి కానీ, హీరోయిన్ గా మాత్రం కాదు,హీరోయిన్ స్నేహితురాలిగా, హీరో కి చెల్లిగా ఇలా వరుసగా సపోర్టింగ్ రోల్స్ వచ్చాయి. అందం మరియు అభినయం ఉంది కూడా ఇలా సపోర్టింగ్ రోల్స్ చేసుకునే స్థాయికి పడిపోయానే అనే బాధ ఈమెలో ఎక్కువగా ఉంది. ప్రముఖ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కి ఈమెకి పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ చిత్రం ‘జల్సా’ లో సెకండ్ హీరోయిన్ రోల్ ఇచ్చాడని, అందుకోసం ఆమెని బాగా వాడుకున్నాడని, కానీ చివరికి ఆ సినిమాలో నాకు అవకాశం ఇవ్వలేదు అంటూ త్రివిక్రమ్ పై ఆరోపణలు చేసింది. ఇందులో ఎంత నిజం ఉందో, ఎంత అబద్దం ఉందో ఎవరికీ తెలియదు.
ఎందుకంటే త్రివిక్రమ్ ఈమె మోసం చేసినట్టు ఎలాంటి ఆధారాలు లేవు, అన్ని ఆరోపణలే, అందుకే ఈమెని నెటిజెన్స్ ఈమధ్య పట్టించుకోవడం మానేశారు. ఇక ఈమె లేటెస్ట్ సినిమాల విషయానికి వస్తే 2022 వ సంవత్సరం లో ‘నాతి చరామి’ అనే సినిమాలో నటించింది.ఈ చిత్రం తర్వాత ఆమె మళ్ళీ ఎలాంటి సినిమాలో కూడా కనిపించలేదు.