Indra Child Artist: వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ లో మెగాస్టార్ చిరంజీవి కి ఆరోజుల్లో ‘ఇంద్ర’ సినిమా ఎంత బూస్ట్ ని ఇచ్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఫ్యాక్షన్ సినిమాల హవా నడుస్తున్న రోజుల్లో విడుదలైన ఈ చిత్రం రికార్డులకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. ఆకలి మీద ఉన్న సింహం వేటాడితే ఎలా ఉంటుందో, అప్పట్లో హిట్ ఆకలి మీద ఉన్న మెగాస్టార్ బాక్స్ ఆఫీస్ వేట మొదలు పెడితే ఏ రేంజ్ లో ఉంటుందో చూపెట్టిన సినిమా ఇది. ఆరోజుల్లోనే ఈ సినిమా దాదాపుగా 28 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది. కేవలం కలెక్షన్స్ పరంగా మాత్రమే కాదు, 50 రోజులు, 100 రోజులు, 175 రోజుల కేంద్రాల విషయంలో కూడా ఈ సినిమా ఆల్ టైం రికార్డ్స్ ని నెలకొల్పింది. అలాగే మొదటి రోజు ఓపెనింగ్ వసూళ్లు, వీకెండ్ వసూళ్లు, మొదటి వారం వసూళ్లు ఇలా అన్నిట్లో ఆల్ టైం రికార్డ్స్ ని నెలకొల్పిన ఏకైక చిత్రం ఇదే ఆరోజుల్లో.
మళ్ళీ ఇలాంటి క్లీన్ ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ గా మగధీర, బాహుబలి సిరీస్ లు నిలిచాయి. ఇకపోతే ఈ సినిమాలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ చిత్రం లో చిరంజీవి చిన్ననాటి పాత్రని పోషించిన తేజ సజ్జ ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నాడో మనమంతా చూస్తూనే ఉన్నాం. హనుమాన్ చిత్రంతో ఏకంగా 400 కోట్ల రూపాయిల గ్రాస్ ని కొల్లగొట్టి, నేటి తరం స్టార్ హీరోలకు కూడా సాధ్యం అవ్వని రికార్డుని నెలకొల్పాడు. ఇదే చిత్రం లో మరో బాలనటుడు కూడా నటించాడు. సినిమాలో ఆ బాలుడు కనిపించింది చాలా తక్కువసేపు అయ్యినప్పటికీ కూడా కథని మరో మలుపు తిప్పే పాత్ర అది. విలన్ పాత్ర అయిన వీర శంకర్ రెడ్డి కొడుకు పాత్రలో ఆ చైల్డ్ ఆర్టిస్ట్ కనిపిస్తాడు. ఆ కుర్రాడి పేరు ప్రణయ్. ఈ బాలనటుడు ఇంద్ర లో తప్ప మరో సినిమాలో నటించలేదు. సినిమాల్లో అవకాశాలు వస్తున్నప్పటికీ కూడా ఆ అబ్బాయి తల్లిదండ్రులు పిల్లవాడి చదువు చెడిపోతుందని ఒప్పుకోలేదు.
చిరంజీవి మీద ఉన్న విపరీతమైన అభిమానం కారణంగా, ఆడిషన్స్ లో చైల్డ్ ఆర్టిస్ట్స్ ని తీసుకుంటున్నారు అని తెలిసి ఈ అబ్బాయిని తీసుకొచ్చి ఆడిషన్స్ చేయించారట. సినిమాలో ఎంపిక అయ్యినందుకు, మెగాస్టార్ చిరంజీవి పక్కన నటిస్తున్నందుకు వీళ్ళు ఎంతో సంతోషించారట. కేవలం మా అబ్బాయి సరదా కోసం, చిరంజీవి మీద వాడికి ఉన్న పిచ్చి అభిమానం కారణంగా అవకాశం వచ్చింది కదా అని ఒక ప్రయత్నం చేసాము, అదృష్టం కలిసి వచ్చింది. మాకు మా అబ్బాయిని సినిమాల్లోకి పూర్తి స్థాయిలో పంపడం ఇష్టం లేదు, వాడు పెద్ద చదువులు చదివి డాక్టర్ అవ్వాలని మా కోరిక అని ప్రణయ్ తల్లిదండ్రులు తమ ఇంటికి వచ్చే దర్శక నిర్మాతలకు చెప్పేవారట. ఇప్పుడు ఆ అబ్బాయి లండన్ లో డాక్టర్ గా స్థిరపడి పెద్ద ఎత్తున డబ్బులు సంపాదిస్తున్నట్టు తెలుస్తుంది.