https://oktelugu.com/

KGF Movie: KGF’ సిరీస్ లో నటించిన ఈ ఆంటీ గుర్తుందా..? ఈమె భర్త టాలీవుడ్ లో ఒక స్టార్ నటుడు..ఎవరో చూస్తే ఆశ్చర్యపోతారు!

ముఖ్యంగా సినిమా ప్రారంభంలో వచ్చే న్యూస్ రిపోర్టర్ క్యారక్టర్ ని అంత తేలికగా ఎలా మర్చిపోగలం చెప్పండి. 'ఇప్పుడేమి చేస్తాడు మీ హీరో' అని ఆమె చెప్పే డైలాగ్ ని సోషల్ మీడియా లో మీమెర్స్ ఒక రేంజ్ లో వాడుకున్నారు.

Written By:
  • Vicky
  • , Updated On : November 2, 2024 / 08:06 PM IST

    KGF Movie

    Follow us on

    KGF Movie: ఒకప్పుడు కన్నడ చిత్ర పరిశ్రమని అసలు ఎవ్వరూ పట్టించుకునేవాళ్ళు కాదు. తెలుగు, తమిళం లో సూపర్ హిట్ అయిన సినిమాలను అక్కడి స్టార్ హీరోలు తరచూ రీమేక్స్ చేస్తూ ఉండేవారు. దీంతో ఆ ఇండస్ట్రీ ని అందరూ రీమేక్ ఇండస్ట్రీ ని అవహేళన చేసేవారు. అసలు కన్నడ సినీ పరిశ్రమని పరిగణలోకి కూడా తీసుకునే వాళ్ళు కాదు. అలాంటి ఇండస్ట్రీ వైపు ప్రపంచం మొత్తం చూసేలా చేసిన దర్శకుడు ప్రశాంత్ నీల్. ఆయన తెరకెక్కించిన ‘కేజీఎఫ్’ సిరీస్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసింది. బాలీవుడ్ లో అయితే ఈ సినిమా పేరు చెప్తే ఆడియన్స్ చెవులు కోసేసుకుంటారు. యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో సరికొత్త టేకింగ్ తో ఈ చిత్రాన్ని డైరెక్టర్ ప్రశాంత్ నీల్ మలచిన తీరు అద్భుతం. సాధారణంగా యాక్షన్ మూవీస్ ఎంత పెద్ద హిట్ అయినా కూడా రెండు మూడు సార్లు చూస్తే బోర్ కొట్టేస్తాది. కానీ కేజీఎఫ్ సిరీస్ ని ఎన్ని సార్లు చూసిన బోరు కొట్టదు, ఆ స్క్రీన్ ప్లే లో అలాంటి మ్యాజిక్ ఉంటుంది. అంతే కాదు ఈ చిత్రంలో నటించిన ప్రతీ యాక్టర్ కి మంచి పేరు వచ్చింది.

    ముఖ్యంగా సినిమా ప్రారంభంలో వచ్చే న్యూస్ రిపోర్టర్ క్యారక్టర్ ని అంత తేలికగా ఎలా మర్చిపోగలం చెప్పండి. ‘ఇప్పుడేమి చేస్తాడు మీ హీరో’ అని ఆమె చెప్పే డైలాగ్ ని సోషల్ మీడియా లో మీమెర్స్ ఒక రేంజ్ లో వాడుకున్నారు. ఇంతకీ ఈమె పేరు మాళవిక అవినాష్. ఈమె తెలుగు లో సినిమాలు చేయలేదు కానీ, కన్నడం, తమిళం మరియు మలయాళం లో చాలా సినిమాలే చేసింది. 2022 వ సంవత్సరం వరకు యాక్టీవ్ గా సినిమాలు చేస్తూ వచ్చిన ఈమె, ప్రస్తుతం సినిమాలకు టీవీ సీరియల్స్ కి బ్రేక్ ఇచ్చింది.

    ప్రస్తుతానికి ఆమె కన్నడ లో ప్రసారమయ్యే ‘జోడి నెంబర్ 1 ‘ అనే షోకి జడ్జిగా వ్యవహరిస్తోంది. ఇదంతా పక్కన పెడితే ఈమె భర్త కూడా ఒక ప్రముఖ నటుడు అనే విషయం చాలా మందికి తెలియదు. ఈమె భర్త పేరు అవినాష్, పేరు చెప్తే గుర్తు పట్టడం చాలా కష్టమే కానీ, ముఖం చూస్తే మాత్రం చిన్న పిల్లవాడు కూడా గుర్తుపట్టగలడు. ముఖ్యంగా 2005 వ సంవత్సరం లో సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ని షేక్ చేసిన సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘చంద్రముఖి’ చిత్రంలో ఈయన రామచంద్ర సిద్ధాంతి గా కనిపిస్తాడు. అదే విధంగా విక్టరీ వెంకటేష్ నాగవల్లి, నాగార్జున డమరుకం, రవితేజ దరువు, రాజుగారి గది, అఖండ వంటి తెలుగు సినిమాల్లో కూడా ఈయన నటించాడు. అలా కన్నడ, తమిళం, తెలుగు, మలయాళం భాషలకు కలిపి సుమారుగా 500 సినిమాల్లో నటించిన ఈయన, ఇప్పటికీ బిజీ అర్సటిస్టుగానే కొనసాగుతున్నాడు. ఏడాదికి కనీసం ఈయన 5 సినిమాల్లో అయినా కనిపించాల్సిందే, ఆ రేంజ్ క్రేజ్ ఉన్న నటుడు ఈయన.