https://oktelugu.com/

Son of Satyamurthy : ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా..? ఇప్పుడు ఆ అమ్మాయి ఎలా తయారైందో చూస్తే నోరెళ్లబెడుతారు..హీరోయిన్లు కూడా పనికిరారు!

చిన్నతనం లో ఎంతో క్యూట్ గా కనిపించిన అనేక మంది చైల్డ్ ఆర్టిస్టులు నేడు గుర్తుపట్టలేని విధంగా మారిపోయి మన ముందుకు హీరోలుగా, హీరోయిన్స్ గా వస్తున్న సంగతి తెలిసిందే.

Written By:
  • Vicky
  • , Updated On : January 9, 2025 / 12:31 PM IST

    Son of Satyamurthy

    Follow us on

    Son of Satyamurthy : చిన్నతనం లో ఎంతో క్యూట్ గా కనిపించిన అనేక మంది చైల్డ్ ఆర్టిస్టులు నేడు గుర్తుపట్టలేని విధంగా మారిపోయి మన ముందుకు హీరోలుగా, హీరోయిన్స్ గా వస్తున్న సంగతి తెలిసిందే. ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్టుగా మంచి పేరు తెచ్చుకొని హీరోగా కూడా సక్సెస్ లు అందుకొని తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్ కి దగ్గరగా వచ్చిన హీరో తరుణ్ లాగా, ఇప్పుడు మరో చైల్డ్ ఆర్టిస్ట్ తేజ సజ్జ అలాగే అయ్యాడు. తరుణ్ తెలుగు సినిమా ఇండస్ట్రీ వరకు ప్రభావం చూపిస్తే, తేజ సజ్జ ఏకంగా ఇప్పుడు పాన్ ఇండియన్ లెవెల్ కి వెళ్ళిపోయాడు. అలా ఎంతో మంది ఉన్నారు. చిన్నతనం లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా నటించిన కావ్య కళ్యాణ్ రామ్ లాంటి వాళ్ళు ఇప్పుడు హీరోయిన్స్ గా చలామణి అవుతున్నారు. ఇది ఇలా ఉండగా అల్లు అర్జున్ నటించిన ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’ చిత్రం మీ అందరికీ గుర్తు ఉండే ఉంటుంది.

    ఈ సినిమా లో అల్లు అర్జున్ అన్న (వెన్నెల కిషోర్) కూతురుగా, ఎంతో క్యూట్ గా కనిపించిన బేబీ వెర్నికా ని అంత తేలికగా ఎవరైనా మర్చిపోగలరా. అప్పట్లో భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం కమర్షియల్ గా యావరేజ్ రేంజ్ అనిపించుకున్నప్పటికీ బేబీ వెర్నికా కి మాత్రం మంచి పేరొచ్చింది. ఈ చిత్రం తర్వాత ఆమె కేవలం ‘నాన్నకు ప్రేమతో’ సినిమాలో మాత్రమే నటించింది. సుకుమార్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సినిమా కమర్షియల్ గా యావరేజ్ రేంజ్ ని మాత్రమే సొంతం చేసుకుంది. ఇందులో వెర్నికా హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ చిన్నప్పటి క్యారక్టర్ ని చేసింది. చిన్నతనం లో క్యూట్ గా, ఆడుకునే బొమ్మ లాగా కనిపించిన వెర్నికా కి అవకాశాలు బాగానే వచ్చాయి కానీ, ఆమె తల్లితండ్రులు చదువు డిస్టర్బ్ అవ్వకూడదు అనే కారణం తో సినిమా ఇండస్ట్రీ కి దూరం పెట్టారు.

    రీసెంట్ గా ఈ పాప ‘పుష్ప 2’ చిత్రం లోని ‘చూసేకి అగ్గిపుల్ల మాదిరి ఉంటాడే నా సామీ’ అనే పాటకు డ్యాన్స్ వేస్తూ రీల్ చేసింది. ఇంస్టాగ్రామ్ లో ఈమె ప్రొఫైల్ ఎక్కడ ఉంటుందో ప్రస్తుతానికి ఎవరికీ తెలియదు కానీ, ఈ వీడియో తో మాత్రం ఆమె మరోసారి బాగా పాపులర్ అయిపోయింది. చిన్నప్పుడు ఎంత క్యూట్ గా ఉందో, ఇప్పుడు కూడా అంతే క్యూట్ గా అనిపిస్తుంది. ఇటీవల కాలం లో సినీ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఎంతో మంది కుర్ర హీరోయిన్స్ తో పోలిస్తే వెర్నికా చాలా అందంగా ఉంది. భవిష్యత్తులో ఈమె సినిమాల్లోకి వస్తుందో లేదో ఇప్పుడే చెప్పలేము కానీ, వస్తే మాత్రం మంచి రేంజ్ కి వెళ్లే అమ్మాయి అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే అందం తో పాటు, ఆమె రీల్ చూస్తుంటే అభినయం కూడా ఇప్పటి తరం హీరోయిన్స్ తో పోలిస్తే బెటర్ గానే ఉంది.