Pan-Indian Heroine: ఈ ఫోటోలో కనిపిస్తున్న చిన్న అమ్మాయి ఎవరో గుర్తు పట్టారా..?, ఈమె టీవీ సీరియల్స్ ద్వారా ఆడియన్స్ కి దగ్గరైంది. ఈ సీరియల్ అప్పట్లో జీ తెలుగు లో ప్రసారం అయ్యేది. అలా సీరియల్స్ ద్వారా వచ్చిన ఫేమ్ తో సినీ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టింది. మొదట్లో ఈమెకు చిన్న చిన్న సినిమాల్లోనే ఆఫర్స్ వచ్చేవి. కానీ అమ్మాయి చాలా అందంగా ఉండడం, దాంతో పాటు నటన కూడా అద్భుతంగా ఉండడం తో పెద్ద స్టార్స్ సినిమాల్లో కూడా అవకాశాలు రావడం మొదలయ్యాయి. సినిమాల్లోకి రాకముందు ఒక డ్యాన్స్ షో ద్వారా కూడా ఈమె మన ఆడియన్స్ కి దగ్గరైంది. సినిమాల్లోకి వచ్చిన తర్వాత ఒక్క సినిమా సూపర్ హిట్ అవ్వడం తో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఇప్పటి వరకు రాలేదు. ఆ హీరోయిన్ మరెవరో కాదు, మృణాల్ ఠాకూర్(Mrunal Thakur).
ఈమె ఎప్పటి నుండో బాలీవుడ్ లో నటిస్తున్నప్పటికీ మన టాలీవుడ్ ఆడియన్స్ కి మాత్రం పరిచయం అయ్యింది ‘సీతారామం’ అనే సినిమాతో. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ లవ్ స్టోరీ కమర్షియల్ గా ఎంత పెద్ద సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిల్చిందో మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా తర్వాత ఆమె తెలుగు లో ‘హాయ్ నాన్న’, ‘ది ఫ్యామిలీ స్టార్’ వంటి చిత్రాల్లో నటించింది. ఇక హిందీ లో అయితే నాన్ స్టాప్ గా అవకాశాలను సంపాదిస్తూ ముందుకు దూసుకుపోతుంది. ప్రస్తుతం ఈమె బాలీవుడ్ లో వరుణ్ ధావన్ తో కలిసి ఒక సినిమా చేస్తుంది. ఇందులో మృణాల్ ఠాకూర్ తో పాటు పూజా హెగ్డే కూడా మరో హీరోయిన్ గా నటిస్తుంది. శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ చిత్రం అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాతో పాటు మరో క్రేజీ పాన్ ఇండియన్ చిత్రం లో కూడా మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుంది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Icon Star Allu Arjun), అట్లీ(Atlee) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాలో మృణాల్ ఠాకూర్ ఒక హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే దీపికా పదుకొనే(Deepika Padukone) ఒక హీరోయిన్ గా ఎంపికైంది. మొత్తం 5 మంది హీరోయిన్స్ ఉన్న ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ మరో గా హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ముంబై లో విరామం లేకుండా జరుగుతుంది. ఈ షెడ్యూల్ లో మృణాల్ ఠాకూర్ కూడా పాల్గొంటుంది. ‘కుంకుమ భాగ్య’ అనే హిందీ టీవీ సీరియల్ ద్వారా మంచి క్రేజ్ ని తెచ్చుకున్న మృణాల్ ఠాకూర్, ఇప్పుడు హీరోయిన్ గా పాన్ ఇండియా రేంజ్ కి ఎదగడం నిజంగా హర్షణీయం. ఇలా సీరియల్స్ నుండి ఎంట్రీ ఇచ్చి టాప్ స్టార్ హీరోయిన్స్ గా ఎదిగిన వాళ్ళు మన ఇండియాలో చాలా అరుదుగా ఉంటారు. వారిలో ఒకరు మృణాల్ ఠాకూర్.