YSRCP rally deaths : జగన్ పర్యటనలో ఇద్దరు కాదు ముగ్గురు చనిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. వైయస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి కొద్ది రోజుల కిందట పల్నాడు జిల్లాలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఓ వైసిపి నేత విగ్రహ ఆవిష్కరణకు గాను ఆయన పోలీస్ ఆంక్షలు నడుమ తాడేపల్లి నుంచి బయలుదేరారు. కానీ భారీ కాన్వాయ్ తో పాటు భారీ జన సమీకరణ నడుమ జగన్ పర్యటన సాగింది. ఈ క్రమంలో జగన్ ప్రయాణిస్తున్న వాహనం ఢీకొని సింగయ్య అనే వృద్ధుడు చనిపోయాడు. మరో వ్యక్తి అపస్మారక స్థితికి చేరుకొని.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. తాజాగా మూడో మృతి వెలుగులోకి వచ్చింది. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన యువకుడిని ఆసుపత్రికి తరలించే క్రమంలో అంబులెన్స్ గంటసేపు జగన్ పర్యటనలో ఆగిపోవడంతో అతను చనిపోయాడు.
* సోషల్ మీడియాలో వీడియో
తాజాగా ఆ యువకుడి తండ్రి విలపిస్తూ చెప్పిన మాటలు ఓ వీడియోలో వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ర్యాలీ సమయంలో అంబులెన్స్ కు దారి ఇచ్చి ఉంటే తమ కుమారుడి ప్రాణాలు దక్కేవని మృతుడి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. ముప్పాళ్ళకు చెందిన మధు గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. సత్తెనపల్లిలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. అతనికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినట్లు వైద్యులు నిర్ధారించారు. మెరుగైన వైద్యం కోసం అంబులెన్స్ లో గుంటూరు తరలిస్తున్న సమయంలో జగన్ పర్యటనలో చిక్కుకున్నారు. దీంతో భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. దాదాపు గంటసేపు అంబులెన్స్ ట్రాఫిక్ లో ఇరుక్కుంది. తరువాతే మధును గుంటూరుకు తరలించారు.
* ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి
ఈనెల 19న ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మధు మృతి చెందాడు. అయితే సకాలంలో ఆసుపత్రిలో చేర్పించకపోవడం వల్లే ఆయన మృతి చెందారని వైద్యులు చెబుతున్నారు. దీంతో ఆ కుటుంబం కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. జగన్ సత్తెనపల్లి ర్యాలీలో పాల్గొన్న జయవర్ధన్ రెడ్డి అనే యువకుడు గుండెపోటుతో మృతి చెందాడు. మరోవైపు సింగయ్య సైతం జగన్ ప్రయాణిస్తున్న వాహనం ఢీకొని మృతి చెందినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పుడు మధు సైతం జగన్ కాన్వాయ్ వల్లే చనిపోయాడని తెలియడం ఆందోళన కలిగిస్తోంది. కాగా బాధిత కుటుంబాన్ని మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ పరామర్శించారు. ముగ్గురు ప్రాణాలను బలిగొన్నారని జగన్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
అంబులెన్స్ కి దారి ఇవ్వని మాజీ ముఖ్యమంత్రి జగన్ , మరో యువకుని మృతి
పోలీసులు అనుమతి ఇవ్వకపోయినా పట్టుబట్టి మరీ సత్తెనపల్లి పర్యటనకు వెళ్లిన జగన్ కారణంగా మూడో వ్యక్తి మరణించిన సంఘటన వెలుగులోకి వచ్చింది.
హృదయవిదారకంగా విలపిస్తున్న ఆ యువకుడి తల్లిదండ్రులను చూసిన వారంతా… pic.twitter.com/QYPXxWnSaG
— (@Trends4TDP) June 25, 2025