Varun Lavanya Marriage: టాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ తేజ్, సొట్టబుగ్గల సుందరి లావణ్య త్రిపాఠిల పెళ్లి ఇటలీలో జరగనున్న సంగతి తెలిసిందే. కుమారుడి పెళ్లిని మెగా బ్రదర్ నాగబాబు ఇటలీలో గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తున్నారు. వీరి వివాహ వేడుక ఏకంగా మూడు రోజుల పాటు జరగనుంది. ఇక వీరి వివాహ వేడుకకు ఎన్నో రోజులు లేదు రేపే అంటే నవంబర్ 1న ఇటలీలో గ్రాండ్ గా చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో లావణ్య, వరుణ్ లు ఒకటి కాబోతున్నారు. వీరి వివాహం తర్వాత రిసెప్షన్ ను హైదరాబాద్ లో నిర్వహిస్తారట. ఈ డేట్ ను కూడా ఫిక్స్ చేశారు. ఇక సినీ ప్రముఖులు అందరూ నవంబర్ 5న వీరి రిసెప్షన్ కు హైదరాబాద్ లో హాజరుకానున్నారు. ఇదిలా ఉంటే అసలు ఇటలీలో వీరి వివాహం ఎందుకు చేస్తున్నారనే అనుమానం చాలా మందిలో ఉంది. అది మీకోసం..
వరుణ్ సోదరి నిహారిక పెళ్లి రాజస్థాన్ లో గ్రాండ్ గా చేశారు. మరి ఇప్పుడు వరుణ్ పెళ్లి ఏకంగా ఇటలీలో చేస్తున్నారు. కేవలం గ్రాండ్ చేయాలని చేస్తున్నారా? లేదా ఈ పెళ్లి వెనుక ఏదైనా సెంటిమెంట్ ఉందా అనే ప్రశ్న అందరిలో మెదులుతుంది. వరుణ్ లావణ్య కలిసి మిస్టర్, అంతరిక్షం అనే రెండు సినిమాలలో నటించారు. ముందుకు శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన మిస్టర్ సినిమా తెరకెక్కింది. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. ఆ తర్వాత అంతరిక్షం సినిమా వచ్చింది. ఇది అభిమానులను ఆకట్టుకున్నా.. కలెక్షన్ల పరంగా కాస్త నిరాశ పరిచిందనే చెప్పాలి. అయితే మిస్టర్ సినిమా షూటింగ్ లో కొన్ని సీన్లు ఇటలీలో చిత్రీకరించారు. కొన్ని పాటలు కూడా ఇటలీలోనే షూట్ చేశారు. ఆ సమయంలో ఇద్దరి మధ్య ప్రేమ చిగురించిందట. అలా వీరిద్దరు ప్రేమలో పడ్డారు.
ప్రేమ పుట్టిన చోటనే పెళ్లి అనే బంధం తో ఇద్దరు ఒకటి కావాలి అనుకున్నారట. అందుకే వీరి వివాహం ఇటలీలో ప్లాన్ చేశారట. ఇప్పటికే ఈ పెళ్లి కోసం మెగా ఫ్యామిలీ కుటుంబ సభ్యులతో పాటు సన్నిహితులు అందరూ ఇటలీ చేరుకున్నారు. సినిమాలు, రాజకీయాలతో ఫుల్ బిజీగా ఉండే పవన్ కళ్యాణ్ కూడా తన భార్య అన్నా లెజ్నోవా తో కలిసి వరుణ్ తేజ్ పెళ్లి కోసం ఇటలీ చేరుకున్నారు. మొత్తం మీద ప్రేమ పుట్టిన చోటనే పెళ్లి జరగాలనే సెంటిమెంట్ తో ఈ జంట ఇటలీలో పెళ్లి చేసుకోనుంది. ఇక రిసెప్షన్ ను హైదరాబాద్ లో నిర్వహించారు కాబట్టి ఇక్కడికి ప్రముఖులు హాజరవుతారని సమాచారం.