RRR Deleted Scenes: #RRR మూవీ ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి సంచలన విజయం గా నిలిచిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..మొదటి రోజు నుండి నేటి వరుకు ఈ సినిమా బాక్స్ ఆఫీస్ రన్ ఏ మాత్రం తగ్గని జోరుతో రోజుకో సరికొత్త బెంచ్ మార్క్ ని సృష్టిస్తూ ప్రభంజనం సృష్టించింది..మరికొద్ది రోజుల్లో బాక్స్ ఆఫీస్ రన్ ని ముగించుకోబోతున్న ఈ సినిమా గురించి ఎవ్వరికి తెలియని కొన్ని ఆసక్తి సన్నివేశాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా సోషల్ మీడియా లో లీక్ అవుతూ అభిమానులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది..ఇక అసలు విషయానికి వస్తే ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర తగ్గింది అంటూ విడుదల రోజు నుండి అభిమానులు సోషల్ మెయిల్ లో రాజమౌళి ని టాగ్ చేస్తూ తెగ తిడుతున్న సంగతి మన అందరికి తెలిసిందే..మేము ఊహించుకున్న స్థాయిలో మా హీరోని చూపించలేదు అని..సినిమా మొత్తం రామ్ చరణ్ కోసమే తీసినట్టు ఉంది అంటూ ఎన్టీఆర్ అభిమానులు ఫీల్ అయ్యారు..దీనికి రాజమౌళి కూడా స్పందించిన సంగతి మన అందరికి తెలిసిందే.

తాను ఒక్కవేల ఇద్దరు హీరోలను సరిసమానంగా చూపించి ఉండకపోతే ఈరోజు సినిమా ఇంత పెద్ద హిట్ అయ్యేది కాదు అంటూ రాజమౌళి చెప్పుకొచ్చాడు..ఫస్ట్ హాఫ్ మొత్తం ఎన్టీఆర్ ఎన్టీఆర్ కి సంబంధించిన స్టోరీ ని చూపిస్తే , సెకండ్ హాఫ్ మొత్తం రామ్ చరణ్ కి సంబంధించిన స్టోరీ చూపించాము అని , ప్రేక్షకులు థియేటర్స్ నుండి బయటికి వచ్చేటప్పుడు ఎక్కువగా సెకండ్ హాఫ్ ని గుర్తు పెట్టుకుంటారు కాబట్టి అలా ఎన్టీఆర్ పాత్ర తగ్గినట్టు అనిపించి ఉండొచ్చు ఏమో అని రాజమౌళి ఈ సందర్భంగా మాట్లాడాడు..అయితే ఇటీవల ఈ సినిమా లో పని చేసిన ఒక్క జూనియర్ ఆర్టిస్ట్ రీసెంట్ ఇంటర్వ్యూ లో చెప్పిన కొన్ని ఆసక్తి కరమైన విషయాలు వింటే ఎన్టీఆర్ పాత్రకి రాజమౌళి నిజంగానే అన్యాయం చేశాడా అనే అనుమానాలు రాక తప్పదు..ఇంతకీ ఆయన ఏమి అన్నాడు అంటే సెకండ్ హాఫ్ లో ఎన్టీఆర్ ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చే సంగతి మన అందరికి తెలిసిందే.
Also Read: Balakrishna: ఆ షోలో హీరో బాలకృష్ణను ఘోరంగా అవమానించారా.. గాడిద అంటూ?
ఎన్టీఆర్ ని జైలు కి తీసుకొచ్చిన సమయం లో ఆయన గొప్పతనం గురించి తెలిసిన కొంతమంది ఆది వాసులు కూడా ఖైదీలుగా అదే జైలు లో ఉంటారు అని..అక్కడ ఎన్టీఆర్ ని చూసిన ఆ ఆదివాసులు షాక్ కి గురి అయ్యి బ్రిటిష్ జాతి మెడ వంచిన ఈ యోధుడు కూడా పట్టుబడ్డాడ అంటూ బాధపడుతూ ఆయనకీ సంబంధించిన ఒక్క చిన్న ఫ్లాష్ బ్యాక్ ని అక్కడ ఖైదీ గా ఉన్న ఒక్క అతను తోటి ఖైదీలకు చెప్తాడు అని, ఆ తోటి ఖైదీలలో నేను కూడా ఒక్కడిని అంటూ చెప్పుకొచ్చాడు ఆ సినిమాలో పని చేసిన ఒక్క జూనియర్ ఆర్టిస్ట్..ఈ సన్నివేశం చేస్తున్నప్పుడే నాకు రోమాలు నిక్కపొడుచుకొని ఫీలింగ్ వచ్చింది అని, కానీ సినిమాలో షూట్ చేసిన ఆ సన్నివేశాలు ఏవి కూడా లేవు అంటూ చెప్పుకొచ్చాడు..ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియా అంతటా వైరల్ గా మారింది..ఎన్టీఆర్ అభిమానులు మొదటి రోజు నుండి ఆరోపిస్తునట్టు గానే రాజమౌళి నిజంగా నందమూరి ఫాన్స్ కి అన్యాయం చేశాడా అనే అనుమానాలు సోషల్ మీడియా లో ప్రారంభం అయ్యాయి..మరి దీనికి రాజమౌళి ఎలాంటి వివరణ ఇస్తాడో చూడాలి మరి.
Also Read: MS Dhoni: మళ్లీ పాత ధోని.. బెస్ట్ ఫినిషర్ బయటకొచ్చాడు..