Ram Charan- Venkatesh: అన్నీ అనుకున్నట్లు జరిగితే రామ్ చరణ్ వెంకటేష్ అల్లుడు కావాల్సిందట. ప్రేమ వ్యవహారం కారణంగా ఈ సంబంధం చెడిందట. దీనికి సంబంధించిన వార్త ప్రస్తుతం టాలీవుడ్ లో చక్కర్లు కొడుతుంది. చిరుత మూవీతో వెండితెరకు పరిచయమైన రామ్ చరణ్ రెండో చిత్రం మగధీరతో ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. ఆ సినిమా రామ్ చరణ్ ఇమేజ్ ని అమాంతం పెంచేసింది. ఇక తనదైన మేనరిజమ్స్, డాన్స్, ఫైట్స్ తో ఆయన మాస్ హీరోగా ఎదిగారు. నటనలో తండ్రికి తగ్గ వారసుడు అనిపించుకున్నాడు. హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఐదేళ్లకే రామ్ చరణ్ వివాహం చేసుకున్నారు.

అపోలో హాస్పిటల్స్ అధినేత అనిల్ కామినేని కూతురు ఉపాసనను పెళ్లి చేసుకున్నారు. 2012 జూన్ 14న రామ్ చరణ్-ఉపాసనల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. సినీ, రాజకీయ ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యారు. టాలీవుడ్ బెస్ట్ కపుల్ గా పేరు తెచ్చుకున్న రామ్ చరణ్-ఉపాసన పదేళ్ల వైవాహిక జీవితం పూర్తి చేశారు. ఇటీవల ఈ జంట 10వ వివాహ వార్షికోత్సవం జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఓ హాలిడే ట్రిప్ కి వెళ్లారు. వారం రోజుల పాటు హాయిగా ఎంజాయ్ చేసి వచ్చారు.
అయితే రామ్ చరణ్ ఉపాసన భర్త కావాల్సింది కాదు. ఆయన టాలీవుడ్ స్టార్ హీరో వెంకటేష్ అల్లుడు కావాల్సిందట. వెంకటేష్ తన పెద్ద కూతురు ఆశ్రితను రామ్ చరణ్ కి ఇచ్చి వివాహం చేయాలి అనుకున్నారట. చిరంజీవి-వెంకటేష్ మధ్య ఈ విషయంలో సంప్రదింపులు కూడా జరిగాయట. ఆశ్రితతో పెళ్లి విషయం చెప్పగానే రామ్ చరణ్ ఓపెన్ అయ్యాడట. తాను చాలా కాలంగా ఉపాసనను ప్రేమిస్తున్నట్లు తండ్రి చిరంజీవితో చెప్పాడట. ఆమెనే వివాహం చేసుకుంటాను అన్నాడట. ఇక చేసేదేమీ లేక వెంకటేష్ కూతురుతో పెళ్లి సంబంధాన్ని క్యాన్సిల్ చేశారట.

మరోవైపు ఆశ్రిత ప్రేమ వివాహం చేసుకోవడం విశేషం. హైదరాబాద్ కి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త సురేందర్ రెడ్డి మనవడితో ఆశ్రిత వివాహం జరిగింది. ఇక పెళ్ళై పదేళ్లు పూర్తయినా ఉపాసన-రామ్ చరణ్ పిల్లల్ని కనలేదు. పలు ఇంటర్వ్యూలలో ఈ సెలెబ్రిటీ జంట ఈ ప్రశ్న ఎదుర్కొంటున్నారు. ఒకటి రెండు సందర్భాల్లో ఉపాసన స్పందించారు. జీవితంలో పిల్లల్ని కనడమే ముఖ్యమైన విషయం కాదు. ఇంకా చాలా ఉంటాయి. అయినా అది పూర్తిగా మా పర్సనల్ మేటర్ అని కొట్టిపారేశారు. రామ్ చరణ్ తో పాటు వివాహం చేసుకున్న ఎన్టీఆర్, అల్లు అర్జున్ ఇద్దరిద్దరు పిల్లలతో చక్కగా ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకున్నారు.