Nani- Dasara: న్యాచురల్ స్టార్ నాని కి ఇటీవల కాలం లో సరైన హిట్టు పడలేదు..కరోనా లాక్ డౌన్ సమయం లో తన సినిమాలైనా ‘V’ మరియు ‘టక్ జగదీశ్’ సినిమాలు డైరెక్టుగా OTT లోనే విడుదలయ్యాయి..ఆ రెండు సినిమాల తర్వాత ఆయన నుండి విడుదలైన ‘శ్యామ్ సింగరాయ్’ చిత్రం మాత్రం బాక్స్ ఆఫీస్ వద్ద పర్వాలేదు అనే రేంజ్ లో ఆడింది..కమర్షియల్ గా ఈ సినిమా హిట్ అయ్యినప్పటికీ కూడా నాని రేంజ్ కాదనే చెప్పాలి..ఇక ఆ తర్వాత వచ్చిన ‘అంటే సుందరానికి’ సినిమాకి టాక్ వచ్చినప్పటికీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద కమర్షియల్ గా ఫెయిల్యూర్ గా నిలిచింది..కెరీర్ జెట్ స్పీడ్ గా వెళ్తున్న సమయం లో నాని ని మరో లెవెల్ కి తీసుకెళ్లే సినిమాలు ఇటీవల కాలం లో పడలేదు అని అభిమానులు ఫీల్ అవుతున్న సమయం లో ఆయన ‘దసరా’ అనే పాన్ ఇండియన్ సబ్జెక్టు ని ప్రకటించాడు..ఈ సినిమాని దాదాపుగా 70 కోట్ల రూపాయిల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు.

ఈ సినిమా ద్వారా శ్రీకాంత్ ఓదెల అనే నూతన దర్శకుడిని ఇండస్ట్రీ కి పరిచయం చెయ్యబోతున్నాడు నాని..ఇటీవలే ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ని విడుదల చెయ్యగా దానికి అభిమానుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది..నాని ని ఇంత మాస్ గా ఎప్పుడు చూడలేదంటూ అభిమానులు ఈ టీజర్ ని చూసి మురిసిపోయారు..ఇక 20 , 30 కోట్ల రేంజ్ షేర్ వసూళ్లు చేసే సినిమా కాదు..కొడితే వంద కోట్ల రూపాయిల షేర్ ని కొట్టాలని నాని బలంగా ఫిక్స్ అయిపోయాడు..అందుకే దసరా సినిమాని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు..అంతే కాకుండా ఈ సినిమాకి ట్రేడ్ నుండి క్రేజీ ఆఫర్లు వస్తున్నాయి.

అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ దాదాపుగా 80 కోట్ల రూపాయలకు జరిగినట్టు తెలుస్తుంది..అంతే కాకుండా నాన్ థియేట్రికల్ రైట్స్ కూడా ఈ సినిమాకి 60 కోట్ల రూపాయిలు బిజినెస్..మొత్తం మీద 140 కోట్ల రూపాయిల బిజినెస్ ని ఈ సినిమా జరుపుకుంటున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి..సినిమా ఔట్పుట్ కూడా అదిరిపోయింది అనే టాక్ ఇండస్ట్రీ లో వినిపిస్తుంది..వచ్చే ఏడాది మార్చి 30 వ తారీఖున ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా అన్నీ ప్రాంతీయ బాషలలో విడుదల చెయ్యడానికి దర్శక నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.