Ram Charan And Allu Arjun: అల్లు అర్జున్ పుష్ప.. రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా కోసం మెగా అభిమానులు అలానే అల్లు అభిమానులు తెగ ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా పుష్పా 2 సినిమా పైన భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ తరుణంలో ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసి అందరిని తెగ షాక్ కి గురి చేశారు సుకుమార్. ఈ సంవత్సరం చివరికో లేదా కనీసం వచ్చే సమ్మర్ సీజన్ కన్న వస్తుంది అనుకున్న పుష్ప 2 ఏకంగా వచ్చే సంవత్సరం ఆగస్టు కి విడుదల చేస్తామంటూ ప్రకటన ఇచ్చారు పుష్ప సినిమా యూనిట్.
ఈ రిలీజ్ ప్రకటన చెబుతూ సినిమా యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్ అందరిని విపరీతంగా ఆకట్టుకున్న ఆ సినిమా విడుదల తేది మాత్రం అందరిని బాధ పడేలా చేసింది. మరోపక్క రామ్ చరణ్ గేమ్ చేంజర్ కూడా ఎన్నో రోజుల నుంచి వాయిదా పడుతూ వస్తోంది.
ఇక ఈ రెండు సినిమాలు వచ్చే సమ్మర్ సీజన్ లో పోటీ పడతాయి అనుకున్నారు. కానీ ప్రస్తుతానికి అది జరిగేలా లేదు. ఇక వచ్చే ఏడాది 2024 సమ్మర్ లో
దాదాపు టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలన్నీ విడుదలకు ముస్తాబవుతున్నాయి. మహేష్ బాబు నుంచి మొదలుకొని పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, ప్రభాస్ ఇలా అందరి హీరోల సినిమాలు వరుసగా ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతున్నాయి.
నిజానికి అల్లు అర్జున్, రామ్ చరణ్ సినిమాలు కూడా వేసవికి రిలీజ్ అయ్యే అవకాశం ఉందని మొన్నటి వరకు వార్తలు వినిపించాయి. కానీ ఇప్పుడు చూస్తే ఆ పరిస్థితి కనిపించడం లేదు. అల్లు అర్జున్ ఏకంగా ఆగస్టు కి పోగా, రామ్ చరణ్ గేమ్ చేంజర్ రిలీజ్ పై కూడా సస్పెన్స్ నెలకొంది. ‘గేమ్ చేంజర్’ షూటింగ్ ఇప్పటికే చివరి దశకు చేరుకుంది. అయితే గేమ్ చేంజర్ తో పాటు దర్శకుడు శంకర్ కమలహాసన్ ‘ఇండియన్ 2’ ని కూడా ఒకే సమయంలో షూటింగ్ చేస్తుండటంతో ‘గేమ్ చేంజర్’ పోస్ట్ ప్రొడక్షన్ ఆలస్యం అవుతుంది అని కాబట్టి ఈ సినిమా కూడా సమ్మర్ కి రిలీజ్ చేయకపోవచ్చు అని వార్తలు వినిపిస్తున్నాయి.
మరో పక్క పుష్పా 2 సినిమా కథను సుకుమార్ మార్పులు చేయడం వల్ల ఆ సినిమా కూడా లేట్ అయిందని.. అందుకే ఈ ఇద్దరు హీరోలు కూడా సమ్మర్ రేస్ నుంచి తప్పుకున్నారని తెలుస్తోంది.