Mahesh Babu: మహేష్ బాబు టాలీవుడ్ టాప్ స్టార్. అత్యధిక ఫ్యాన్ బేస్ కలిగిన హీరో. జయాపజయాలతో సంబంధం లేకుండా ఆయన సినిమాలు వందల కోట్ల వసూళ్లు సాధిస్తాయి. ఈ మధ్య కాలంలో మహేష్ బాబుకు ప్లాప్ లేదు. మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న గుంటూరు కారం కూడా మంచి వసూళ్లు అందుకుంది. అలాగే మహేష్ బాబు మిస్టర్ పర్ఫెక్ట్. వివాదాలకు దూరంగా ఉంటాడు. వీటన్నింటికీ మించి అందగాడు. హాలీవుడ్ హీరో రేంజ్ లో ఉంటాడు. మరి అలాంటి మహేష్ అల్లుడిగా రావాలని ఎవరు మాత్రం కోరుకోరు.
స్టార్ గా ఎదుగుతున్న మహేష్ బాబును బాలకృష్ణ అల్లుడు చేసుకోవాలని అనుకున్నాడట. ఇదే విషయం మహేష్ బాబుతో చెప్పాడట. మహేష్ మా పెద్దమ్మాయి బ్రాహ్మణిని వివాహం చేసుకుంటావా? అని అడిగాడట. బాలకృష్ణ ప్రపోజల్ ని మహేష్ బాబు సున్నితంగా తిరస్కరించాడట. మహేష్ బాబు నో చెప్పడంతో బాలకృష్ణ తన మేనల్లుడు నారా లోకేష్ కి ఇచ్చి పెళ్లి చేశాడట.
బ్రాహ్మణి చదువు సంధ్య కలిగిన అమ్మాయి. లెజెండ్ ఎన్టీఆర్ మనవరాలు. అలాగే చాలా అందంగా ఉంటుంది. మరి మహేష్ బాబు ఎందుకు ఆమెను రిజెక్ట్ చేశాడంటే.. అప్పటికే మహేష్ బాబు ప్రేమలో ఉన్నాడు. 2002లోనే హీరోయిన్ నమ్రతతో మహేష్ బాబుకు రిలేషన్ మొదలైంది. వంశీ మూవీ సెట్స్ లో ప్రేమలో పడిన ఈ జంట 2005లో వివాహం చేసుకున్నారు. నమ్రతను ప్రేమిస్తున్న మహేష్ బాబు ఆమెను వివాహం చేసుకోవాలని ఫిక్స్ అయ్యాడు. అందుకే బాలకృష్ణ ప్రపోజల్ కి నో చెప్పాడు
నమ్రత-మహేష్ బాబు అత్యంత నిరాడంబరంగా వివాహం చేసుకున్నారు. వీరి పెళ్లి సమాచారం మీడియాకు తెలియదు. చెప్పాలంటే రహస్య వివాహం అని చెప్పొచ్చు, అప్పట్లో మహేష్ బాబు మ్యారేజ్ న్యూస్ సంచలనం రేపింది. వివాహం అనంతరం నమ్రత యాక్టింగ్ మానేసింది. వీరికి గౌతమ్, సితార సంతానం. ప్రస్తుతం మహేష్ బాబు వ్యవహారాలు ఆమె స్వయంగా చూసుకుంటున్నారు. మహేష్ బాబు సంపాదనను ఆమె పెట్టుబడిగా మారుస్తున్నారు. టాక్స్, ఎండార్స్మెంట్స్ చూసుకుంటుంది.
కాగా మహేష్ బాబును బాలకృష్ణ అల్లుడు చేసుకోవాలనుకున్నాడన్న దానిపై ఎలాంటి అధికారిక సమాచారం లేదు. సోషల్ మీడియాలో ఈ మేరకు ఓ వార్త తరచుగా వైరల్ అవుతుంది. ప్రస్తుతం మహేష్ బాబు ఎస్ఎస్ఎంబి 29కి సిద్ధం అవుతున్నాడు. దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం జనవరిలో సెట్స్ పైకి వెళ్లనుందని రచయిత విజయేంద్ర ప్రసాద్ వెల్లడించారు.