https://oktelugu.com/

Namrata Shirodkar: ఒక్కడు సినిమాలో హీరోయిన్ గా నమ్రత ని కృష్ణ ఎందుకు రిజెక్ట్ చేశాడో తెలుసా..?

సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు ను కూడా మొదట్లో హీరోగా పనికిరాడు అని ఆయన మీద చాలా విమర్శలు చేశారు. కానీ ఒక్కడు సినిమాతో తన లైఫ్ మొత్తం మారిపోయింది.

Written By:
  • Gopi
  • , Updated On : January 24, 2024 / 09:11 AM IST
    Follow us on

    Namrata Shirodkar: సినిమా ఇండస్ట్రీ లో ప్రస్తుతం వారసుల హవా ఎక్కువగా కొనసాగుతుంది. ఇండస్ట్రీ లో ఉన్న బడా ఫ్యామిలీలు అయిన మెగా, నందమూరి, ఘట్టమనేని ఫ్యామిలీలా నుంచి ఒక స్టార్ హీరో ఉన్నాడు. అలాగే వాళ్ళు తీస్తున్న సినిమాలు కూడా చాలా జెన్యూన్ గా ఉండడంతో ప్రేక్షకులు వాళ్ళని హీరోలుగా, స్టార్ హీరోలుగా ఆదరిస్తూ వస్తున్నారు. ఇక ఒక సినిమాని చూస్తున్న ప్రేక్షకుడు ఆ సినిమాలో హీరో క్యారెక్టర్ తో తనని తాను పోల్చి చూసుకుంటాడు. కాబట్టి ఆ క్యారెక్టర్ లో హీరో ఒదిగిపోయి నటుంచినట్లైతే ప్రతి ప్రేక్షకుడు కూడా అతని అభిమాని గా మారిపోయి,ఆయన్ని ఆరాధిస్తూ ఉంటాడు.

    ఇక ఈ క్రమంలో కొంతమంది వారసులు స్టార్ హీరోలుగా మారితే మరి కొంతమంది మాత్రం ఇండస్ట్రీలో హీరోగా పరిచయం అయినప్పటికీ పెద్దగా సక్సెస్ లు లేక మధ్యలోనే ఫేడ్ అవుట్ అయిపోతున్నారు. ఇక సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు ను కూడా మొదట్లో హీరోగా పనికిరాడు అని ఆయన మీద చాలా విమర్శలు చేశారు. కానీ ఒక్కడు సినిమాతో తన లైఫ్ మొత్తం మారిపోయింది. ఒక్కసారిగా ఓవర్ నైట్ లో మహేష్ బాబు స్టార్ హీరోగా మారిపోయాడు. అప్పటి వరకు విమర్శించిన పతి నోరు కూడా మూగబోయింది. హిట్టు అంటే ఇలా ఇది, హీరో అంటే మహేష్ లా ఉండాలి అనేలా గొప్ప పేరు తెచ్చుకున్నాడు.

    ఇక ఈ సినిమా దర్శకుడు అయిన గుణశేఖర్ ఒక్కడు సినిమాలో మహేష్ బాబు ని అప్పటివరకు ఇండస్ట్రీలో ఏ డైరెక్టర్ చూపించని విధంగా కొత్తగా చూపించి మొత్తానికైతే ఆ సినిమాని సక్సెస్ తీరానికి చేర్చాడు. ఇక ఇదిలా ఉంటే మహేష్ బాబు ఈ సినిమాలో మొదట హీరోయిన్ గా నమ్రత ను తీసుకుందాం అనుకున్నాడు. ఎందుకంటే అప్పటికే మహేష్ బాబు నమ్రతకు మధ్య వంశీ సినిమాలో మంచి కెమిస్ట్రీ కుదిరింది అనే పేరు రావడం తో తనని తీసుకోవాలని అనుకున్నాడు. కానీ వంశీ సినిమా ప్లాప్ అయ్యింది. ఇక ఇప్పుడు చేయబోయే సినిమాతో హిట్ కొట్టి వాళ్ళది సక్సెస్ ఫుల్ కాంబో అనిపించు కోవాలని మహేష్ బాబు అనుకున్నాడు, కానీ మహేష్ నిర్ణయానికి కృష్ణ అడ్డుపడ్డాడు.

    నమ్రత కి పెద్దగా సక్సెస్ లేవు, కాబట్టి ఆమె మీద మార్కెట్ ఎక్కువగా జరగదు.ఈ సినిమాకి భూమిక అయితే బెస్ట్ ఎందుకంటే ఆమె ఇంతకు ముందు పవన్ కళ్యాణ్ తో ఖుషి సినిమా చేసి మంచి సక్సెస్ లో ఉందని చెప్పడంతో, కృష్ణ సలహా మేరకు ఈ సినిమాలో భూమిక ని హీరోయిన్ గా తీసుకున్నారు. ఇక దాంతో కృష్ణ చెప్పినట్టుగానే ఈ సినిమాకి భూమిక చాలా హెల్ప్ అయింది. అలాగే సినిమా సూపర్ సక్సెస్ అయింది…