Gudumba Shankar: పవన్ కళ్యాణ్ గుడుంబా శంకర్ లో భూమిక ని రిజెక్ట్ చేయడానికి కారణం ఏంటో తెలుసా..?

పవర్ స్టార్ ఖుషి సినిమా తర్వాత చేసిన సినిమాలు అన్నీ కూడా వరుసగా ప్లాప్ అవుతూ వచ్చాయి. అయినప్పటికీ ఆయన మాత్రం ఎక్కడా తగ్గకుండా తన ఫ్యాన్స్ కి తన నుంచి ఏం కావాలో తెలుసుకొని అలాంటి సినిమాలే చేసుకుంటూ వచ్చాడు. అయినప్పటికీ వాటిలో కొన్ని లోపాలు ఉండడం వల్ల ఆ సినిమాలు పెద్దగా ఆడలేదు.

Written By: Gopi, Updated On : January 24, 2024 9:23 am

Gudumba Shankar

Follow us on

Gudumba Shankar: మెగా ఫ్యామిలీ హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ చాలా తక్కువ సమయంలోనే ఎక్కువ హిట్లు కొట్టి ఇండస్ట్రీలో ఎవరికి సాధ్యం కానీ విధంగా పవర్ స్టార్ అనే బిరుదుని సంపాదించుకున్నాడు. ఇక పవన్ కళ్యాణ్ ఇప్పటికి కూడా ఫుల్ ఫ్లేడ్జ్ డ్ గా సినిమాలు చేస్తే ఆయన స్టార్ డమ్ ముందు ఏ హీరో కూడా నిలబడలేడు అనేది వాస్తవం.

ఆయన కున్న ఫ్యాన్ ఫాలోయింగ్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఏ హీరోకి లేదు అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ఆయనను బీట్ చేసే హీరో ఇప్పటివరకు ఇండస్ట్రీలో కనిపించలేదు, ఇకమీదట కనిపించరు కూడా, ఎందుకంటే ఇండస్ట్రీ లో ఆయన స్థాయి వేరు, అభిమానుల్లో ఆయన స్థానం వేరు…
అలాంటి పవర్ స్టార్ ఖుషి సినిమా తర్వాత చేసిన సినిమాలు అన్నీ కూడా వరుసగా ప్లాప్ అవుతూ వచ్చాయి. అయినప్పటికీ ఆయన మాత్రం ఎక్కడా తగ్గకుండా తన ఫ్యాన్స్ కి తన నుంచి ఏం కావాలో తెలుసుకొని అలాంటి సినిమాలే చేసుకుంటూ వచ్చాడు. అయినప్పటికీ వాటిలో కొన్ని లోపాలు ఉండడం వల్ల ఆ సినిమాలు పెద్దగా ఆడలేదు.

అయినప్పటికీ తను ఎక్కడ కూడా నిరాశ చెందకుండా ఆయన అభిమానులకి ఒక మాస్ మసాలా సినిమా ఇవ్వాలనే ఉద్దేశ్యం తోనే గబ్బర్ సింగ్ లాంటి సినిమా చేసి సూపర్ సక్సెస్ ని అందుకున్నాడు.ఇక ఇదిలా ఉంటే తన కెరియర్ లోనే ఒక బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ఖుషి సినిమాలో తనకు జోడిగా నటించిన భూమిక ని గుడుంబా శంకర్ సినిమా కోసం డైరెక్టర్ వీర శంకర్ తీసుకుందామని పవన్ కళ్యాణ్ కి చెప్తే ఆయన మాత్రం భూమిక వద్దని తనని రిజెక్ట్ చేసినట్టుగా అప్పట్లో చాలా వార్తలు వచ్చాయి.

దానికి కారణం ఏంటి అంటే భూమిక గుడుంబా శంకర్ సినిమాలో ఉన్న క్యారెక్టర్ కి సెట్ అవ్వదు, అందుకే ఆమె కాకుండా వేరే హీరోయిన్ ని తీసుకుందామని పవన్ కళ్యాణ్ వీర శంకర్ తో చెప్పినట్టుగా వార్తలు వచ్చాయి. అయితే భూమిక అంతకు ముందు చేసిన అన్ని క్యారెక్టర్లు కూడా చాలా వైల్డ్ క్యారెక్టర్లు హీరోలతో పాటు సమానమైన ప్రాముఖ్యత ఉన్న క్యారెక్టర్లు కావడం వల్ల ఆమె ఆ సినిమాల కి ప్లస్ అయింది. కానీ ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కి పెద్దగా ప్రాముఖ్యత ఉండదు, కాబట్టి పవన్ కళ్యాణ్ భూమిక ని వద్దని డైరెక్టర్ వీర శంకర్ తో చెప్పాడట…