Surya Jyothika: ప్రేమించి పెళ్లి చేసుకొని కోలీవుడ్ లో బెస్ట్ కపుల్ గా పేరు సంపాదించిన వారిలో ముందుంటారు జ్యోతిక, సూర్య. నటనలో ఇద్దరు ఏ మాత్రం తీసిపోరు. సినిమాలు, పర్సనల్ లైఫ్ రెండింటిని పర్ఫెక్ట్ గా నడిపిస్తుంటారు. ఎలాంటి రిమార్క్ లేకుండా ఉన్నతమైన జీవితం గడుపుతున్నారు ఈ కోలీవుడ్ స్టార్ కపుల్స్. అయితే కోలీవుడ్ లో మాత్రమే కాదు టాలీవుడ్ లో కూడా ఈ ఇద్దరికి ఎంతో మంది అభిమానులు ఉన్నారు. జ్యోతిక, సూర్య ఇద్దరు కూడా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే.
పెళ్లి చేసుకోవాలంటే ఒకరిలో ఒకరికి నచ్చే క్వాలిటీస్ చాలా ఉంటాయి. లవ్ మ్యారేజ్ లో అయితే ఇవి కామన్. కానీ పెద్దలు కుదిర్చిన పెళ్లిలో నార్మల్. అయితే సూర్య, జ్యోతికలు కూడా ఇష్టపడే పెళ్లి చేసుకున్నారు. కానీ సూర్యను జ్యోతిక ఎందుకు పెళ్లి చేసుకున్నారా అన్న విషయాల గురించి ఇదివరకు ఎక్కడ ప్రస్తావించలేదు. తాజాగా ఈమె తన పుట్టినరోజు సందర్భంగా సూర్యను తాను పెళ్లి చేసుకోవడానికి గల కారణాలను తెలియజేశారు. ఈ జంట పెళ్లి మొత్తం నెల రోజులలోపు జరిగిపోయిందని తెలియజేశారు. సూర్య నాకు ఇచ్చిన గౌరవానికే నేను తనకు పడిపోయానని, తనలో ఆ క్వాలిటీ నచ్చి పెళ్లి చేసుకున్నాను అని తెలిపింది.
తాను సూర్య మొదటిసారి పూవెల్లమ్ కెట్టుప్పర్ అనే సినిమాలో నటించారని గుర్తు చేసింది..అంతే కాదు తనతో చాలా క్యాజువల్ గా మాట్లాడేవారట. ఈ సినిమా తర్వాత వారిద్దరు కలిసి మరో ఏడు సినిమాలలో నటించారు. అయితే సూర్య గురించి మరింత కొనియాడుతూ మరికొన్ని విషయాలు వెల్లడించింది జ్యోతిక. ఏ సినిమాలో నటించినా కూడా డైరెక్టర్ చెప్పే రొమాన్స్ సీన్స్ మాత్రమే చేసేవారట. అంతేకాదు దానిని అదునుగా తీసుకొని ఈయన ఎప్పుడు నాతో అలా బిహేవ్ చేయలేదని.. అలా ఆయన ఇచ్చే గౌరవమే తనకు చాలా నచ్చిందని తెలిపింది. అప్పట్లో జ్యోతిక ఉదయం 9 నుంచి సాయంత్రం 6 వరకు పనిచేసేదట. తన జీవితానికి సరిపడా డబ్బు సంపాదించిందట. ఆ క్షణమే సూర్య తన ప్రేమ విషయాన్ని చెప్పడంతో నెల రోజుల్లోనే పెళ్లి జరిగిపోయిందని తెలిపింది.