Homeఎంటర్టైన్మెంట్Chiranjeevi-Balakrishna: చిరంజీవి-బాలయ్య మల్టీస్టారర్ మూవీ మధ్యలోనే ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Chiranjeevi-Balakrishna: చిరంజీవి-బాలయ్య మల్టీస్టారర్ మూవీ మధ్యలోనే ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Chiranjeevi-Balakrishna: తెలుగు సినిమా పరిశ్రమలో చిరంజీవి, బాలకృష్ణ రెండు కళ్లలాంటి వారు. తమదైన శైలిలో చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకులను రంజింపచేయడంలో ముందుంటారు. రెండు భిన్న ధృవాలైనా ఇండస్ట్రీకి వారే పెద్దదిక్కు. అందుకే వారి చిత్రాల కోసం అభిమానులు వేయి కళ్లతో ఎదురు చూస్తుంటారు. సంక్రాంతి వచ్చిందంటే సందడే. చిరు, బాలయ్య అభిమానుల ఆశలకు అంతే ఉండదు. తమ ప్రియతమ కథానాయకుల కోసం వారి అంచనాలు కూడా అదే రేంజ్ లో ఉంటాయి. చిత్ర విజయంలో కీలక పాత్ర పోషిస్తుంటారు. తమ అభిమాన హీరోల చిత్రాలను అపురూపంగా చూస్తారు. అందుకే సంక్రాంతి బరిలో వీరి చిత్రాలు బాక్సాఫీసు బొనాంజాగా నిలవడం ఖాయం.

Chiranjeevi-Balakrishna
Chiranjeevi-Balakrishna

సమరసింహారెడ్డి-స్నేహం కోసం, నరసింహనాయుడు-మృగరాజు, ఖైదీనెంబర్ 150-గౌతమీపుత్ర శాతకర్ణి ఇలా ప్రతి సంవత్సరం సంక్రాంతి బరిలో వీరి చిత్రాలు ఉండాల్సిందే. అభిమానులకు కనుల పండుగ కావాల్సిందే. అంతటి అభిమానులను సంపాదించుకున్న వీరి కలయికలో ఓ చిత్రం రూపుదిద్దుకోనున్నా కొన్ని కారణాల వల్ల అది సాధ్యం కాలేదు. కానీ వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తే చూడాలని అభిమానుల కోరిక అలాగే ఉండిపోయింది.

Also Read: Acharya Movie Review: రివ్యూ : ఆచార్య

తెలుగు సినిమా పరిశ్రమలో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుకు ఎనలేని పేరు ఉంది. ఆయన దర్శకత్వంలో చేయాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. అలాంటి ఆయనే వీరిద్దరి కోసం ఓ కథ తయారు చేశారట. దానికి ఇద్దరు కూడా పచ్చజెండా ఊపారట. సినిమా ప్రారంభమైంది. షూటింగ్ నడుస్తోంది. కానీ మధ్యలో మెగాస్టార్ తాను నటించలేనని చెప్పారట. దీంతో ఆ సినిమా ఆగకూడదనే ఉద్దేశంతో బాలయ్య రెండు పాత్రలు తానే చేస్తానని చెప్పడంతో ఇక చేసేది లేక బాలయ్యతోనే సినిమా పూర్తి చేశారు.

ఇంతకీ అది ఏ సినిమా అనే ఉత్కంఠ అందరిలో వస్తోంది కదూ. దాని పేరు అపూర్వ సహోదరులు. బాలకృష్ణ ద్విపాత్రాభినయంతో వచ్చిన సినిమా అది. ఈ విషయం చాలా మందికి తెలియదు కానీ ఆనాడు చిరంజీవి తప్పుకోకుండా ఉంటే అప్పుడే వారి కాంబినేషన్ ప్రేక్షకులకు కనువిందు చేసేది. బ్యాడ్ లక్ మళ్లీ మల్టీస్టారర్ సినిమా దొరుకుతుందా? దొరికినా వీరిద్దరి కాంబినేషన్ కలుస్తుందా? అని అభిమానుల్లో తీరని కలగానే మిగిలిపోతోంది.

Chiranjeevi-Balakrishna
Chiranjeevi-Balakrishna

రాఘవేంద్రరావు పనితీరు మీద నమ్మకమున్నా రెండు మూడు ప్రాజెక్టులు రావడంతో మెగాస్టార్ తప్పుకోవడంతో అందరు ఖంగుతిన్నారు. మళ్లీ ఆ చాన్స్ వస్తుందో రాదోనని అప్పుడే అనుమానపడ్డారు. అనుకున్నట్టే అయింది. వారి కాంబినేషన్ లో ఏ కథ కూడా రాలేదు. దీంతో ఇప్పటివరకు కూడా వారి కలయిక సాధ్యం కాలేదు. దీంతో ఇక విధిపైనే భారం వేసి నిట్టూర్చారు. భవిష్యత్ లో వారి కలయికలో చిత్రం వస్తుందో లేదో అని అందరు ఎదురు చూస్తున్నా వారి ఆశలు మాత్రం ఫలించే దాఖలాలు కనిపించడం లేదు.

Also Read:CM Stalin: తమిళనాడులో ‘తెలుగు’ అభిమానం.. సీఎం స్టాలిన్ అభినందనలు అందుకున్న వైనం

Recommended Videos:

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

5 COMMENTS

  1. […] Marriage Age: ఈడంత పోయినాక పెళ్లెందుకు.. ఆకలంత పోయినాక అన్నమెందుకు అంటారు. ఏ వయసులో జరగాల్సిన అచ్చటముచ్చట ఆ వయసులో జరగాలి. లేకపోతే కష్టమే. జీవితంలో ఎన్నో ఒడిదుడుకులున్నా వివాహం మాత్రం కచ్చితంగా సరైన సమయానికే చేసుకుంటే బాగుంటుంది. దీని కోసం యువత సిద్ధమవ్వాలి. ఉపాధి దొరికిన తరువాత చేసుకుంటానని వాయిదా వేసుకుంటే అది కుదరదు. పెళ్లి అనేది వాయిదా వేస్తే మనకు ఇబ్బందులు తప్పవు. […]

  2. […] Chiranjeevi: టాలీవుడ్ లో పరిచయం అక్కర్లేని పేరు. ఆయన పేరు వింటే చాలు రికార్డులు మారుమోగుతాయి. ముసలి వారు సైతం స్టెప్పులేస్తారు. ఇక కుర్రకారు అయితే చెప్పనవసరం లేదు. అలాంటి వారు మన మెగాస్టార్ చిరంజీవి. సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా యువతరం హీరోలకు తీసిపోకుండా డాన్సులు చేస్తూ అందరి చేతి శభాష్ అనిపించుకుంటున్న మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో నటించిన సినిమా ఆచార్య. ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. రాంచరణ్ నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమాలో ఆయన కూడా ఓ రోల్ పోషించారు. ఇక ఇంకేముంది మెగా అభిమానులకు పండగే. […]

Comments are closed.

RELATED ARTICLES

Most Popular