Telusu Kada vs Dude Movie: సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వాళ్లను వాళ్ళు స్టార్ హీరోలుగా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నారు. ‘డీజే టిల్లు’ సినిమాతో స్టార్ హీరోగా మారిపోయిన సిద్దు జొన్నలగడ్డ సైతం వరుసగా సక్సెస్ లను సాధించడానికి మంచి కథలను ఎంచుకొని ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇక అందులో భాగంగానే ‘నీరజ కోన’ దర్శకత్వంలో చేసిన ‘తెలుసు కదా’ సినిమా ఈనెల 17వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక రీసెంట్ గా ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ ను కూడా రిలీజ్ చేశారు. ట్రైలర్ ను బట్టి చూస్తుంటే ఈ సినిమా ట్రయాంగిల్ లవ్ స్టోరీ గా తెరకెక్కినట్టుగా తెలుస్తోంది. ఈ సినిమా ఎలాంటి విజయాన్ని సాధిస్తోంది.ప్రేక్షకుల్లో ఎలాంటి అటెన్షన్ ను క్రియేట్ చేస్తుంది అనేదే తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికైతే ఈ సినిమా మీద మంచి అంచనాలైతే ఉన్నాయి. ఇక ప్రేక్షకులకు నచ్చినట్టుగా ఈ సినిమా ఉంటుందా? లేదంటే ఇంతకుముందు తెలుగులో వచ్చిన చాలా రొటీన్ సినిమాల మాదిరిగానే ఈ సినిమా స్టోరీ ఉండబోతుందా? అనేది తెలియాల్సి ఉంది…
ఇక తమిళ్ హీరో అయిన ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన డ్యూడ్ సినిమా కూడా ఈనెల 17వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. కారణం ఏంటి అంటే ప్రదీప్ రంగనాథన్ ఇంతకుముందు చేసిన ‘డ్రాగన్’ సినిమా సూపర్ సక్సెస్ అయింది.
20 కోట్ల బడ్జెట్ తో తీసిన ఈ సినిమా 100 కోట్లకు పైన కలెక్షన్లు రాబట్టడంతో ప్రేక్షకులందరిలో తీవ్రమైన అటెన్షన్ క్రియేట్ అయింది. ప్రస్తుతం ప్రదీప్ రంగనాథన్ నుంచి ఏ సినిమా వచ్చినా కూడా అది మినిమం గ్యారంటీ సినిమాగా ఉండబోతుందనే వార్తలైతే వస్తున్నాయి… ఇక 17వ తేదీన తెలుసు కదా, డ్యూడ్ రెండు సినిమాలు రిలీజ్ అవుతున్న నేపథ్యంలో వీళ్ళిద్దరి మధ్య తీవ్రమైన పోటీ ఉంది. వీళ్ళలో ఎవరు విజయాన్ని సాధిస్తారు. ఎవరికి స్టార్ ఇమేజ్ దక్కుతోంది అనేది తెలియాల్సి ఉంది.
ఇక దీపావళి కనుక ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమాలు ప్రేక్షకులకు మంచి కిక్ నిచ్చే అవకాశమైతే ఉంది. ఇక అందులో ఏ సినిమా పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంటుందో ఆ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ ని దక్కించుకుంటుంది. తద్వారా కలెక్షన్ల వర్షం కూడా కురిపించే అవకాశాలు ఉన్నాయి…ఇక ఈ రెండు సినిమాల్లో విజయం ఎవరిదో తెలియాలంటే మరో రెండు రోజుల పాటు వెయిట్ చేయాల్సిన అవసరమైతే ఉంది…