Photo Story: సినిమాలో నటించే అవకాశం రావడమే అరుదు. అలాంటి ఇండస్ట్రీని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడం అంటే మాటలు కాదు. చిత్ర పరిశ్రమలో తల పండిన డైరెక్టర్లు ఎన్నో ప్రయోగాలు చేస్తే గానీ.. స్టార్ గుర్తింపు రాలేదు. కానీ ఈయన తీసింది కొన్ని సినిమాలే.. ఒక్కో సినిమా తీయడానికి కనీసం 2 నుంచి 3 సంవత్సరాల సమయం పడుతుంది. కానీ ఆ సినిమా సక్సెస్ అవుతుంది. అలా వరుస వియాలు అందుకుంటూ సంచలనాల దర్శకుడిగా పేరుతెచ్చుకుంటున్నాడు. తనకంటూ ప్రత్యేకంగా గుర్తింపు తెచ్చుకు ఆయన చిన్న నాటి ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ ఈ కుర్రాడు ఎవరో అనేగా.. మీ సందేహం?.
ఇప్పటికైనా గుర్తుపట్టారా? అయితే మేమే చెబుదాం.. ఓ వ్యక్తి చేతిలో చిన్నటి చిరునవ్వు చిందిస్తున్న ఆ కుర్రాడు ఎవరో కాదు ది గ్రేట్ రాజమౌళి. సీనియర్ డైరెక్టర్ దగ్గర శిష్యరికం చేసిన రాజమౌళి తీసిన సినిమాలన్నీ సక్సెస్ సాధించినవే. ‘స్టూడెంట్ నెంబర్ వన్’ సినిమాతో డైరెక్టర్ రంగంలో అడుగుపెట్టిన రాజమళి అప్పటి నుంచి వరుస సినిమాలు తీస్తూ వస్తున్నాడు. ఈ మూవీ తరువాత ఎన్టీఆర్ తో తీసిన ‘సింహాద్రి’ సినిమాతో రాజమౌళి ఫేమస్ అయ్యాడు. ఆ తరువాత ‘ఛత్రపతి’తో సౌత్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు.
రెబల్ స్టార్ ప్రభాస్ తో కలిసి ‘ఛత్రపతి’ తీసిన తరువాత రాజమౌళి రేంజ్ మారిపోయింది. ఆయన తీసే సినిమాలో ఒక్క చాన్స్ అయిన రావాలని చాలా మంది సీనియర్ నటులు కోరుకున్నారు. కానీ రాజమౌళి కుర్ర హీరోలతో సినిమాలు తీస్తూ హిట్టుకొట్టాడు. ప్రభాస్ తో ఆయన తీసిన బాహుబలి సినిమాలు వరల్డ్ ఫేమస్ తెచ్చుకున్నాయి. లాస్ట్ మూవీ ఆర్ఆర్ఆర్ ప్రపంచ స్థాయికి వెళ్లి ఆస్కార్ అవార్డును తెచ్చుకున్న విషయం తెలిసిందే.
రాజమౌళి లేటేస్టుగా సీనియర్ హీరో మహేష్ బాబుతో సినిమా తీసేందుకు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నాడు. ఇందులో దీపికా పదుకునే హీరోయిన్ ఉంటుందని ఇప్పటికే డిసైడ్ అయ్యారు. మహేష్ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ తో బిజీగా ఉన్నాడు. ఆ తరువాత రాజమౌళి సినిమాలో నటించే అవకాశం ఉందని తెలుస్తోంది. మహేష్ బాబు బర్త్ డే ఆగస్టు 9న సందర్భంగా ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుందని అంటున్నారు.