OG movie child actor: పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ‘ఓజీ'(They Call Him OG) చిత్రం రీసెంట్ గానే భారీ అంచనాల నడుమ విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన వసూళ్లను రాబడుతూ కేవలం మొదటి వారం లోనే 90 శాతం కి పైగా రీకవరీ ని సాధించి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. సాధారణంగా దసరా సీజన్ లో పండగకి ముందు జనాలు సినిమాలు చూసే మూడ్ లో ఉండరు, కలెక్షన్స్ చాలా తక్కువ వస్తాయని అంతా అనుకున్నారు. కానీ ఈ సినిమా ప్రీ ఫెస్టివల్ సీజన్ లో కూడా స్టడీ కలెక్షన్స్ ని నమోదు చేసుకుంది. ఇక పండగ సీజన్ లో ఏ రేంజ్ వసూళ్లు వస్తాయో ఊహించుకోవచ్చు. ఇదంతా పక్కన పెడితే ఈ చిత్రం మిగిలిన వర్గాల ఆడియన్స్ తో పోలిస్తే, యూత్ ఆడియన్స్ లో అద్భుతమైన రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది. పవన్ కళ్యాణ్ స్టైల్, స్వాగ్..సుజిత్ టేకింగ్, థమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఈ చిత్రాన్ని మరో లెవెల్ కి తీసుకెళ్లాయి.
సినిమా ప్రారంభం లో జపాన్ లోని కొన్ని సన్నివేశాలు చూపిస్తారు గుర్తుందా. యాకూజా,సమురాయ్ వర్గాల మధ్య యుద్ధం, సమురాయ్ లో మిగిలిన కొంతమందిని వాళ్ళు చంపేయడం, వారిలో ఒకరు తప్పించుకొని వెళ్లడం, ఆ ఒక్కరు హీరో క్యారక్టర్ ఓజాస్ గంభీర అవ్వడం, ఇలా అద్భుతమైన డిటైలింగ్ తో డైరెక్టర్ సుజిత్ ఆరంభం లోనే సిక్సర్ కొట్టేసాడు. ఈ సన్నివేశాల్లో పవన్ కళ్యాణ్ చిన్నప్పటి క్యారక్టర్ పోషించిన అబ్బాయి చాలా డైనమిక్ గా అనిపించాడు. కుర్రాడు చూసేందుకు అచ్చు గుద్దినట్టు పవన్ కొడుకు అకిరా నందన్ లాగా ఉన్నాడు. ఇతన్నే సినిమాలో పెట్టుకోవచ్చు కదా, వేరే వాళ్ళని ఎందుకు తీసుకున్నారు అంటూ రీసెంట్ గా సుజిత్ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో యాంకర్ అడుగుతాడు. దానికి సుజిత్ సమాధానం చెప్తూ, అకిరా తో చేస్తే పూర్తి స్థాయి సినిమా చెయ్యాలి, అతని రేంజ్ కి ఇది చాలా చిన్నదిగా అనిపించింది, అందుకే తీసుకోలేదు అంటూ చెప్పుకొచ్చాడు.
అయితే ఇంతకీ ఆ క్యారక్టర్ చేసిన కుర్రాడు ఎవరు?, ఎక్కడి నుండి వచ్చాడు వంటి వివరాలను పరిశీలిస్తే, ఇతను సుజిత్ కి బాగా పరిచయమైన ఒక యంగ్ హీరో కుటుంబానికి సంబంధించిన అబ్బాయి అట. బహుశా అడవి శేష్ కుటుంబానికి చెందిన వాడు అయ్యుండొచ్చు అని అంటున్నారు. మార్షల్ ఆర్ట్స్ లో చిన్న తనం నుండే మంచి స్టూడెంట్ గా ఈ కుర్రాడికి పేరుంది అట. ఇతని పేరు ఆకాష్ అని సమాచారం. చూసేందుకు చాలా చురుగ్గా ఉన్నాడు, స్క్రీన్ ప్రెజెన్స్ కూడా అదిరిపోయింది, కాస్త పెద్దవాడు అయ్యాక సినిమాల్లోకి హీరో గా కూడా ఎంట్రీ ఇవ్వొచ్చు, ఇతనికి ఆ కెపాసిటీ ఉందని సోషల్ మీడియా లో నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు. ముఖ్యంగా ఇన్ స్టాగ్రామ్ లో ఓజీ మొదటి సన్నివేశం లో వచ్చే ‘అదిరెను ఊరు..విని తన పేరు’ షాట్ బాగా హైలైట్ అయ్యింది.