Sridevi: ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న నటి శ్రీదేవి (Sridevi)… తెలుగులో ఉన్న స్టార్ హీరోలందరితో కలిసి నటించిన ఆమె బాలీవుడ్ హీరోలతో సైతం నటించి ఇండియాలోనే టాప్ హీరోయిన్ గా ఎదిగింది. తను ప్యాక్ స్టేజ్ లో ఉన్నప్పుడే ప్రముఖ నిర్మాత సైనా భోని కపూర్ ను పెళ్లి చేసుకొని సినిమాల నుంచి తప్పుకున్న విషయం మనకు తెలిసిందే. కొన్ని సంవత్సరాల క్రితం ఆమె హార్ట్ ఎటాక్ తో చనిపోయింది. ఏది ఏమైనా కూడా అతిలోకసుందరిగా తనకంటూ ప్రత్యేకమైన ఐడెంటిటిని ఏర్పాటు చేసుకున్న శ్రీదేవిని బీట్ చేసే హీరోయిన్ ఇప్పటివరకు రాలేదని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. చాలామంది దర్శక నిర్మాతలు సైతం ఆవిడకి అభిమానులుగా మారిపోయారు. ఆమె చాలా అందంగా ఉండటమే కాకుండా చాలా చక్కటి అభినయాన్ని చూపిస్తూ ప్రేక్షకులను కట్టిపడేసేది. ముఖ్యంగా చిరంజీవితో చేసిన ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ (Jagadeeja వీరుడు Athiloka Sundari) సినిమాలో ఆమె దేవకన్యగా ప్రేక్షకులను అలరించడమే కాకుండా ఆ సినిమా సక్సెస్ లో కీలకపాత్ర వహించింది. చిరంజీవి లాంటి స్టార్ హీరోకి సైతం పోటీని ఇస్తూ ఆమె ఆ సినిమాలో నటించిన విధానమైతే చాలా ఎక్స్ట్రాడినరీగా ఉందనే చెప్పాలి… అయితే శ్రీదేవి హీరోయిన్ గానే కాకుండా చైల్డ్ ఆర్టిస్ట్ గా కూడా కొన్ని సినిమాల్లో నటించింది. కార్తీకదీపం (Karthika Deepam) అనే సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది.
Also Read: పవన్ కళ్యాణ్ చేతిలో ఉన్నది ‘తుపాకీ’ కాదు..ఈ ఆయుధం పేరు,దాని చరిత్ర తెలిస్తే మెంటలెక్కిపోతారు!
ఇక ఆ సినిమాలో ఆమెతో పాటు మరో నటుడు అయిన జెడి చక్రవర్తి కూడా నటించాడు అనే విషయాన్ని రీసెంట్ గా తను ఒక ఇంటర్వ్యూలో తెలియజేశాడు. జేడీ చక్రవర్తి సైతం తెలుగులో చాలా మంచి సినిమాలు చేశాడు. విలన్ గా, హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా నటించి తనదైన రీతిలో సత్తా చాటుకున్నాడు.
ప్రస్తుతం ఆయన ఒక సినిమాను డైరెక్షన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ఆయన డైరెక్షన్ లో వచ్చిన ఒకటి రెండు సినిమాలు ఆశించిన మేరకు విజయాన్ని సాధించకపోయిన కూడా మరో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యాడు. రీసెంట్ గా ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో తను శ్రీదేవి తో కలిసి చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించాను అనే విషయాన్ని తనే స్వయంగా చెప్పడం విశేషం…
ఇక ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియా విపరీతంగా వైరలవుతుంది… జేడీ చక్రవర్తికి రాంగోపాల్ వర్మ చేసిన శివ(Shiva) సినిమాలో మొదటి అవకాశమైతే దక్కింది. అందులో విలన్ పాత్రను పోషించిన ఆయన మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఆ తర్వాత హీరోగా చేసి వరుస సినిమాలతో సక్సెస్ ఫుల్ హీరోగా మారిపోయాడు…