Sudigali Sudheer Bigg Boss 9 Offer: బిగ్ బాస్ సీజన్ 9 స్టార్ట్ అయింది. ఇక మొత్తానికైతే ఈ సీజన్ ను 15 మంది కంటెస్టెంట్లతో చాలా గ్రాండ్ గా స్టార్ట్ చేశారు. ప్రస్తుతం సెలబ్రిటీలతో పాటు కామనర్స్ ని కూడా ఇందులో భాగం చేయడంతో ఈ సీజన్ కి ఎనలేని గుర్తింపైతే వస్తోంది. మొత్తానికైతే ఈ సీజన్లో సెలబ్రిటీస్ విజయం సాధిస్తారా కామనర్స్ గా వచ్చిన వారు విజయం సాధిస్తారా అనే దాని మీదనే సర్వత్ర ఆసక్తి అయితే నెలకొంది…ఇక ఇప్పటివరకు చాలా మంచి పాపులారీటిని సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న ఈ షోలో ఈ సీజన్ కోసం ఒక హీరోని సైతం భాగం చేయాలని అనుకున్నారట. ఆ హీరోకి టెంప్టింగ్ ఆఫర్ ఇవ్వడంతో మొదట్లో వస్తానని చెప్పినప్పటికి ఆ తర్వాత వంద రోజులు ఇంట్లోనే ఉండాలి అంటే సినిమాలకు ఇబ్బంది అవుతుందనే ఉద్దేశ్యంతోనే ఆయన చివరి నిమిషంలో తప్పుకున్నట్టుగా తెలుస్తోంది.
మరి ఇంతకీ ఆ హీరో ఎవరు అంటే ‘సుడిగాలి సుధీర్’ గా తెలుస్తోంది. జబర్దస్త్ షో తో మంచి పాపులారిటి ని సంపాదించుకున్న సుధీర్ ఆ తర్వాత సినిమాలో హీరోగా చేసి మంచి విజయాలను అందుకున్నాడు. ఇక హీరోగా రాణిస్తూనే యాంకర్ గా కూడా పలు షో లకు వ్యవహరిస్తుండటం విశేషం… ఈయనను ఈ షోలో భాగం చేస్తే వ్యూయర్ షిప్ ఎక్కువగా వస్తుందని షో యాజమాన్యం అయితే భావించారు.
కానీ సుధీర్ కి ఉన్న కమిట్ మెంట్ల వల్లే తను ఈ షో నుంచి తప్పుకున్నాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మరి ఏది ఏమైనా కూడా సుదీర్ కనక ఈ షోలో భాగమైతే ఒక వీక్ లో అందరికంటే హైయెస్ట్ పేమెంట్ తీసుకునే వ్యక్తిగా సుధీర్ అవతరించేవాడు. కానీ ఆయనకున్న కమిట్మెంట్స్ వల్ల ఆయన ఈ షోలో భాగం కాలేకపోయాడు…అయితే ఆయన రాకపోవడం వల్ల షో కి కూడా చాలా వరకు నష్టం జరిగిందనే చెప్పాలి. ఆయన పేరు మీద చాలా బిజినెస్ అయితే జరిగేది. ఇక అడ్వర్టైజ్మెంట్లు సైతం ఎక్కువగా వచ్చేవి…
దానివల్ల షోకి విపరీతమైన లాభం అయితే వచ్చేది. కానీ ఇప్పుడు తను రాకపోవడంతో షో కి భారీగా నష్టం వస్తుందనే అంచనాలో షో యాజమాన్యం భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక దానికి తగ్గట్టుగానే స్పెషల్ గెస్ట్ లుగా కొంతమందిని తీసుకొచ్చి ఎలాగైనా సరే ఈ షో ని టాప్ లెవల్ కి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో షో యాజమాన్యం ఉన్నట్టుగా తెలుస్తోంది…