Highest-paid Actors and Directors: ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీ రేంజ్ మారిపోయింది. ఇండియాలోని ఏ ఇతర భాషల నుంచి సినిమాలు వచ్చిన కూడా భారీ కలెక్షన్స్ ని కొల్లగొడుతూ ముందుకు దూసుకెళ్తూ ఉండటం విశేషం… ఇక మరికొద్ది రోజుల్లో ఇండియన్ సినిమా ఇండస్ట్రీ సైతం హాలీవుడ్ రేంజ్ కి వెళ్ళిపోతుందనేది వాస్తవం…ప్రస్తుతం రాజమౌళి వారణాసి సినిమాతో పాన్ వరల్డ్ సినిమాని చేస్తున్నాడు. ఈ సినిమాతో ఎలాగైనా సరే ప్రపంచ స్థాయి ప్రేక్షకులను అలరించాలనే ప్రయత్నంలో ఉన్నాడు. ఈ సినిమాలో మహేష్ బాబు 5 డిఫరెంట్ గెటపుల్లో కనిపిస్తున్నాడు… ఇక రాజమౌళితో పాటు చాలామంది దర్శకులు ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మీద వాళ్ళ మార్కును చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న మార్కెట్ ను బట్టి ఏ డైరెక్టర్ ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు. ఏ హీరో పారితోషకం విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వడం లేదు. ఏ మ్యూజిక్ డైరెక్టర్ సినిమాలను తన మ్యూజిక్ తో నిలబెట్టి అత్యధిక రెమ్యూనరేషన్ ను ఛార్జ్ చేస్తున్నాడు అనే విషయాలను మనం ఒకసారి తెలుసుకుందాం…
ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మీద చెరగని ముద్ర వేసిన దర్శకుడు రాజమౌళి… అతను ఒక సినిమా కోసం దాదాపు 300 కోట్ల వరకు రెమ్యూనరేషన్ ఛార్జ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది…
‘బాహుబలి’ మూవీతో హీరోగా తన సత్తా చాటుకున్న ప్రభాస్ సైతం ఇప్పుడు అత్యధిక రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్నాడట. ఒక సినిమా కోసం దాదాపు 200 కోట్ల వరకు రెమ్యూనరేషన్ ను ఛార్జ్ చేస్తున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి. ఇక ఇండియాలోనే ఇప్పటివరకు ఏ హీరో కూడా ఇంత రెమ్యునరేషన్ ను చార్జ్ చేయడం లేదు…
ఇక మ్యూజిక్ డైరెక్టర్ల విషయానికి వస్తే ప్రస్తుతం అనిరుధ్ కి చాలా మంచి మార్కెట్ ఉంది. తనకు పోటీగా ఎంతమంది మ్యూజిక్ డైరెక్టర్లు ఉన్నప్పటికి అతని మ్యూజిక్ గాని, బ్యాగ్రౌండ్ స్కోర్ విషయంలో గానీ ఎక్కడా కాంప్రమైజ్ అవ్వడం లేదు. దర్శకులు సైతం అతన్ని రిపీట్ చేయడానికి గల కారణం ఏంటి అంటే అతను సినిమాలోని సీన్ నార్మల్ గా ఉన్నా కూడా తన బ్యా గ్రౌండ్ మ్యూజిక్ తో సీన్ ను నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్తాడనే ఉద్దేశ్యంతోనే అతన్ని సినిమాలో తీసుకుంటున్నారు.
ఇక ప్రస్తుతం ఆయన ఒక సినిమాకి దాదాపు 20 నుంచి 25 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారట. ఒక మ్యూజిక్ డైరెక్టర్ అంత మొత్తంలో రెమ్యూనరేషన్ ఛార్జ్ చేయడం అనేది చాలా అరుదు… ప్రస్తుతం ఉన్న వారిలో అనిరుధ్ ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది…