Homeఎంటర్టైన్మెంట్Hero Siddharth: హీరో సిద్ధార్థ్ ప్రేమలో పడి నిండా మునిగిన హీరోయిన్లు వీరే

Hero Siddharth: హీరో సిద్ధార్థ్ ప్రేమలో పడి నిండా మునిగిన హీరోయిన్లు వీరే

Hero Siddharth: తెలుగు సినిమా పరిశ్రమలో సంబంధాలు ఎవరికి అర్థం కావు. ఎవరు ఎవరితో ఉంటున్నారో ఎవరికి అర్థం కావు. ఒకరి ఇద్దరితో ఉండొచ్చు. ముగ్గురితో ఉండొచ్చు. ఎవరి మనసుకు ఇష్టమైతే వారితో కాలం గడిపేయడం మామూలే. సినిమాలోలా బయట కూడా వారు విచ్చలవిడిగానే ప్రవర్తిస్తుంటారు. వారి సంబంధాల గురించి ఆలోచిస్తే మనకే పిచ్చెక్కడం ఖాయం. అంతలా మారిపోతున్న సంబంధాల గురించి అందరిలో ఆశ్చర్యం కలుగుతోంది. ఎవరి చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం. ఒక్కొక్కరు ఇద్దరు ముగ్గురితో గడపడం విడ్డూరమే. కానీ మనకు విచిత్రంగా అనిపించినా వారికి మాత్రం ఇది మామూలే. తమ కెరీర్ లో ఇలా పశువుల్లా ప్రవర్తించడం వారి నైజం.

Hero Siddharth
siddharth, samantha, shruthi hasan

తెర మీద మనకు చూపించే సన్నివేశాలే వారి నిజ జీవితంలో చూపిస్తున్నారు. ఒక్కో జంట ఎంత కాలం ఉంటుందో చెప్పలేం. ఎవరితో ఉంటుందో కూడా తెలియదు. ఇవాళ ఒకరితో ఉన్న వారు రేపు మారిపోవచ్చు. ఇంకొకరితో ప్రేమాయణం సాగించవచ్చు. లేకపోతే సహజీవనమే చేయవచ్చు. ఈ మధ్య బాగా నచ్చిన పధం సహజీవనం. మన సంస్కృతి మాయమై పాశ్చాత్య పోకడలు మనమీద కూడా పనిచేస్తున్నాయి. దీంతో మానవ సంబంధాల్లో మంచి మచ్చుకైనా కనిపించడం లేదు. అంతా బ్రాంతియేనా? భ్రమలాగే బతుకుతున్నారు.

Also Read: Naga Chaitanya-Akhil Multistarrer: ఫ్లాప్ డైరెక్టర్ తో నాగ చైతన్య – అఖిల్ మల్టీస్టార్ర్ర్ చిత్రం ఖరారు

ఆ మధ్య మన తెలుగు తెరకు పరిచయమైన హీరో సిద్ధార్థ. అతడి వయసు ఎంత ఉన్నా నడిపిన ప్రేమాయణాలు మాత్రం కోకొల్లలు. చాలామందితో ఎఫైర్ పెట్టుకుని అందరికి బ్రేకప్ చెప్పిన ధీరుడు. మొదట స్టార్ హీరోయిన్ సమంతతో ప్రేమాయణం నడిపాడు. కొంతకాలం వీరు కలిసి ఉన్నారు. కానీ ఎందుకో వీరి వివాహానికి ఏవో గ్రహాలు అడ్డుపడ్డాయని కాణిపాకంలో పూజలు సైతం చేయించుకున్నా ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో విడిపోయారు. దీంతో వీరి మధ్య ఎడం పెరిగి చివరకు దూరంగా ఉన్నారు.

Hero Siddharth
siddharth soha ali khan

హిందీ సినిమా రంగ్ దే బసంతీ సినిమాలో తనతో పాటు నటించిన సోహా అలీఖాన్ ను కూడా ప్రేమించాడు. ఈ విషయం మొదటి భార్యకు తెలియడంతో ఆమె విడాకులు ఇచ్చి వెళ్లిపోయింది. కొన్ని సంవత్సరాలు సోహా అలీఖాన్ తో సహజీవనం చేసిన సిద్ధార్థ్ ఆమెతో కూడా విడిపోయాడు. తమ ప్రేమకు బ్రేకప్ చెప్పేశాడు. దీపా సన్నిధితో కూడా ఎఫైర్ ఉందనే వార్తలు అప్పట్లో హల్ చల్ చేశాయ. కానీ ఆమె తనకు అతడికి ఎలాంటి సంబంధం లేదని స్వయంగా చెప్పింది.

అప్పుడే పరిశ్రమలోకి వచ్చిన శృతిహాసన్ ను కూడా వదలలేదు. ఆమెతో కూడా ప్రేమాయణం సాగించాడు. కొద్దిరోజులు సహజీవనం కూడా చేశాడు. కానీ వీరిద్దరు 2011లో విడిపోయారు. తరువాత అతిథిరావు హైదరీని కూడా బుట్టలో వేసుకున్నాడు. మాయమాటలు చెప్పి వశం చేసుకున్నాడు. మహాసముద్రం సినిమాలో వీరిద్దరు జోడిగా నటించారు. వీరి ప్రేమపై సినిమా పరిశ్రమ కోడై కూస్తోంది. ఇప్పటికైనా ఈమెతోనైనా కడదాకా ఉంటాడా? మధ్యలోనే బ్రేకప్ చెప్పేసి ఉడాయిస్తాడా? అనేదే అనుమానం. సిద్ధార్థ చేతిలో పడిన వారిని ఆ దేవుడే కాపాడాలి అని అందరు చెబుతుంటారు. అతడి మససు ఇప్పుడైనా స్థిమితంగా ఉంటుందా? లేక పెడదారి పడుతుందా వేచి చూడాల్సిందే.

Also Read:DJ Tillu Sequel: DJ టిల్లు సీక్వెల్ కి ఊహించని షాక్.. రంగం లోకి దిగిన మరో డైరెక్టర్
Recommended Videos
హీరో సిద్ధార్థ్ ప్రేమలో పడి నిండా మునిగిన హీరోయిన్లు వీరే || Hero Siddharth Love Affairs
పవన్ ని  నమ్ముకుని నలిగిపోతున్న హీరోయిన్ || Pawan Kalyan || Nidhi Agarwal || Hari Hara Veera Mallu

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
Exit mobile version