Pawan Kalyan And People Media Factory: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన ప్రతి సినిమా ప్రేక్షకుల్లో అటెన్షన్ ని క్రియేట్ చేసుకుంటుంది. గత సంవత్సరం వచ్చిన ఓజీ సినిమాతో మరోసారి పవన్ కళ్యాణ్ భారీ సక్సెస్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఈ సంవత్సరం సైతం ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. ఇక వీటితోపాటుగా మరికొన్ని సినిమాలకు తను కమిట్ అవుతున్నట్టుగా తెలుస్తుంది. సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో ఒక సినిమా చేయడానికి కమిట్ అయిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇక రీసెంట్ గా ఈ సంస్థ ప్రొడ్యూసర్ అయిన టీజీ విశ్వప్రసాద్ తో మీటింగ్ ని జరిపిన పవన్ కళ్యాణ్ ఒక సినిమా చేయడానికి సిద్ధమయ్యాడు. దాంతో ఈ మూవీ అనౌన్స్మెంట్ ని వీలైనంత తొందరలో ఇవ్వడానికి సిద్ధమవుతున్నాడు. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా మెహర్ రమేష్ డైరెక్షన్ లో తెరకెక్కే అవకాశాలైతే ఉన్నాయి. కానీ వాటిలో ఏ సినిమా కూడా సక్సెస్ ని సాధించలేదు. ఇక ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ కి భారీ ఫ్లాప్ లను కట్టబెట్టిన ఘనత కూడా మెహర్ రమేష్ కి దక్కింది.
ప్రభాస్ తో బిల్లా లాంటి సినిమా చేసి అతనికి మంచి విజయాన్ని అందించినప్పటికి ఎన్టీఆర్ కి రెండు సినిమాలతో ప్లాప్ లను అందించాడు. వెంకటేష్, చిరంజీవి లాంటి హీరోలకు సైతం ఆయన ప్లాప్ సినిమాలను కట్టబెట్టడం విశేషం…మెహర్ రమేష్ డైరెక్షన్లో సినిమా చేస్తే అది అల్ట్రా డిజాస్టర్ గా మిగులుతుందనే నమ్మకం ప్రతి ఒక్కరిలో ఉంది.
ఇక ఇలాంటి సందర్భంలో పవన్ కళ్యాణ్ ఎందుకని మెహర్ రమేష్ కి అవకాశాన్ని ఇస్తున్నాడు అనే ధోరణిలో సోషల్ మీడియాలో అతని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఒకవేళ ఈ సినిమా కనక పట్టా లెక్కితే అది మెహర్ రమేష్ అదృష్టమనే చెప్పాలి. ఇక ఈ సినిమాతో సక్సెస్ సాధిస్తే ఆయన మీద ఉన్న నెగెటివిటీ అంతా పోతుంది.
మెహర్ రమేష్ ఒక సినిమా మీద పెద్దగా ఫోకస్ చేయడు అనే విషయం మనకు తెలిసిందే. అందువల్ల అతనికి భారీ డిజాస్టర్లు వస్తున్నాయి. వరుస సినిమాలతో ఆయన సక్సెస్ ని సాధిస్తేనే అతనికి ఇక మీదట డైరెక్టర్ గా కెరియర్ ఉంటుంది. లేకపోతే మాత్రం అతనికి మరే హీరో కూడా అవకాశాలు ఇచ్చే ఛాన్స్ లేదు…