Photo Story: తెలుగు సినిమాల్లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్లుగా కొనసాగిన వాళ్లు ఆ తరువాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. అక్కగా, అత్తగా, వదినగా ఇలా సాఫ్ట్ గా ఉన్న పాత్రలను మాత్రమే చేసేవారు. రమ్యకృష్ణ లాంటి వాళ్లు హీరోయిన్ గా ఉన్నప్పుడే ప్రతికూల పాత్రలను చేసి మెప్పించారు. ఆ కోణంలోనే బాహుబలి సినిమాలో గాంభీర్య నటనతో ఆకట్టుకున్నారు. ఇక రమ్యకృష్ణ హీరోయిన్ గా ఉన్న సమయంలోనే మరో నటి స్టార్ హీరోయిన్ గా కొనసాగింది. అయితే ఈమె తెలుగులో తక్కువ చేసినా తమిళంలో వందల కొద్దీ సినిమాల్లో నటించింది. అయితే ఇప్పుడు తెలుగులో క్యారెక్టర్ ఆర్టిస్టుగానే కాకుండా విలన్ నటించి ఆకట్టుకుంటోంది. ఇంతకీ ఈ హీరోయిన్ ఎవరో తెలుసా?
1980 ల కాలంలో వచ్చిన చాలా మంది హీరోయిన్లలో కొందరు పెళ్లిళ్లు చేసుకొని సెటిలైపోగా.. మరికొందరు క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తూ రాణిస్తున్నారు. వీరిలో నళిని ఒకరు. నళిని మొదట్లో 1981లో ‘రణువ వీరన్’ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఆ తరువాత కొన్నాళ్లు గ్యాప్ ఇచ్చిన 1988 నుంచి వరుసగా సినిమాల్లో నటించారు. అయితే ఆమె హీరోయిన్ గా నటించిన మొదటి సినిమా ‘కుంగుమ కోడు’. ఇలా కొన్ని సినిమాల్లో నటిస్తున్న నళిని చూసి కొందరు తెలుగు డైరెక్టర్లు ఫిదా అయిపోయారు.
దీంతో ఆమెను 1983లో మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘సంఘర్షణ’ అనే సినిమా కోసం తీసుకున్నారు. మురళీమోహన్ రావు డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టింది. ఇందులో విజయశాంతితో పాటు నళిని రెండో హీరోయిన్ గా నటించింది. ఆ తరువాత ‘ఇంటిగుట్టు’ అనే సినిమాలో కూడా నటించింది. అయితే తెలుగులో ఆమెకు పెద్దగా గుర్తింపు రాలేదు. పైగా ఇక్కడున్న హీరోయిన్ల ధాటికి ఆమె తట్టుకోలేకపోయారు. దీంతో తమిళ ఇండస్ట్రీకి వెళ్లి అక్కడే పలు సినిమాల్లో నటించారు.
ఇలా కొన్నాళ్ల పాటు హీరోయిన్ గా నటించిన నళిని మధ్యలో గ్యాప్ ఇచ్చారు. ఆ తరువాత 2002లో రవితేజ నటించిన ‘వీడే’ అనే సినిమాలో లేడీ విలన్ నటించారు. ఈ పాత్ర బాగా షూటవడంతో ఆ తరువాత ఆమె హరికృష్ణ హీరోగా నటించిన ‘సీతయ్య’ సినిమాలో మెయిన్ విలన్ గా నటించారు. చివరికి రవితేజ నటించిన ‘కిక్’ సినిమాలో సినిమా ప్రారంభంలో నళిని మనం చూడొచ్చు. ఇక సినిమాల్లో ఆమెకు షూటయ్యే పాత్రలు రాలేదు. దీంతో నిరాశ చెందలేదు.
టీవీ సీరియళ్లలో నటించే అవకాశం రావడంతో ఆమె వదులుకోలేదు. ‘అమ్మ నా కోడలా’ అనే సీరియల్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన ఆమె పలు సీరియళ్లో నటించింది. ప్రస్తుతం మా ఛానెల్ లో ‘జానకి కలగనలేదు’ అనే సీరియల్ లో కనిపిస్తుంది. ఇలా సినీ ఇండస్ట్రీలో ఏ పాత్ర చేయడానికైనా ముందుకు వచ్చిన నళిని చిన్నప్పటి ఫొటోలు బయటకువ వస్తున్నాయి. ఈ సందర్భంగా మెగాస్టార్ తో ఆమె నటించిన అప్పటి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.