https://oktelugu.com/

Samantha New Boyfriend: సమంత కొత్త బాయ్ ఫ్రెండ్ ఇతనేనా? ఎప్పుడూ అతనితోనే!

షూటింగ్ ముగిశాక అతనితో సమంత కనిపిస్తున్నారు. సమంత ప్రవర్తన అనుమానాలకు దారి తీస్తుండగా ఆమె ప్రేమలో పడ్డారంటూ కథనాలు వెలువడుతున్నాయి. దీనిపై స్పష్టత రావాల్సి ఉంది.

Written By:
  • Shiva
  • , Updated On : June 28, 2023 / 04:48 PM IST

    Samantha New Boyfriend

    Follow us on

    Samantha New Boyfriend: ప్రతి మనిషికి తోడు అవసరం. అందుకే పెళ్లనేది ఒకటి ఉంది. భారతీయ సంస్కృతి కూడా మారిపోయింది. పెళ్లి తప్పనిసరి కాదనే పరిస్థితి నెలకొంది. లివ్ ఇన్ రిలేషన్ కల్చర్ ఎక్కువైపోయింది. సెలబ్రిటీలే కాదు సామాన్యులు కూడా పెళ్లి కాకుండానే కలిసి జీవిస్తున్నారు. ఇలియానా, డింపుల్ హయాతి, శృతి హాసన్, మలైకా అరోరా మనకు తెలిసి సహజీవనం చేస్తున్న కొందరు సెలెబ్రిటీలు. ఇలియానా అయితే ఏకంగా గర్భం దాల్చించి. ఎవరి కారణంగా ఆమె తల్లి అయ్యారో కూడా ఆమె చెప్పలేదు.

    కాగా సమంతకు విడాకులై రెండేళ్లు అవుతుంది. ఆమె సింగిల్ స్టేటస్ మైంటైన్ చేస్తున్నారు. నాగ చైతన్య మాత్రం హీరోయిన్ శోభిత దూళిపాళ్లతో ఎఫైర్ నడుపుతున్నారనే ప్రచారం ఉంది. కాగా సమంత ఓ వ్యక్తితో సన్నిహితంగా ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అతడు సమంత కొత్త బాయ్ ఫ్రెండ్ కావచ్చనే ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం సమంత సెర్బియా దేశంలో ఉంది. సిటాడెల్ షూటింగ్ కోసం ఆమె అక్కడ కెళ్లారు.

    షూటింగ్ ముగిశాక అతనితో సమంత కనిపిస్తున్నారు. సమంత ప్రవర్తన అనుమానాలకు దారి తీస్తుండగా ఆమె ప్రేమలో పడ్డారంటూ కథనాలు వెలువడుతున్నాయి. దీనిపై స్పష్టత రావాల్సి ఉంది. 2018లో నాగచైతన్య-సమంత ప్రేమ వివాహం చేసుకున్నారు. గోవాలో వీరి పెళ్లి హిందూ, క్రిస్టియన్ సాంప్రదాయాల్లో జరిగింది. పెళ్ళైన నాలుగేళ్లకు 2021 అక్టోబర్ లో విడాకుల ప్రకటన చేశారు. పరస్పర అవగాహనతో విడిపోతున్నట్లు ప్రకటించిన ఈ జంట, కారణాలు వెల్లడించలేదు.

    సమంత ప్రస్తుతం ఖుషి, సిటాడెల్ ప్రాజెక్ట్స్ లో నటిస్తున్నారు. ఖుషి రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్. దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కిస్తున్నారు. విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్నారు. సెప్టెంబర్ 1న ఖుషి విడుదల కానుంది. ఇక సిటాడెల్ యాక్షన్ వెబ్ సిరీస్. రాజ్ అండ్ డీకే తెరకెక్కిస్తున్నారు. వరుణ్ ధావన్ మరో ప్రధాన పాత్ర చేస్తున్నారు. అమెజాన్ ప్రైమ్ లో ఇది అందుబాటులోకి రానుంది. కాగా సమంత లేటెస్ట్ రిలీజ్ శాకుంతలం నిరాశపరిచింది. సమంత కెరీర్లో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది.