Prashanth Varma : ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు తమకంటూ ఒక సపరేట్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇక యంగ్ డైరెక్టర్లు సైతం స్టార్ డైరెక్టర్లుగా ఎదగాలనే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక దానికోసమే అహర్నిశలు కష్టపడుతున్నట్టుగా కూడా తెలుస్తోంది… మరి ఇప్పుడున్న యంగ్ డైరెక్టర్లలో ప్రశాంత్ వర్మ లాంటి దర్శకుడు తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తున్నాడనే చెప్పాలి…
సినిమా ఇండస్ట్రీలో యంగ్ డైరెక్టర్స్ కి భారీ క్రేజ్ అయితే పెరుగుతుంది. ప్రస్తుతం వాళ్లు చేస్తున్న సినిమాలతో ప్రేక్షకులను మైమరిపింపచేయడమే కాకుండా వాళ్ళకంటూ ఒక సపరేట్ ఐడెంటిటిని కూడా క్రియేట్ చేసుకుంటున్నారు. ముఖ్యంగా ప్రశాంత్ వర్మ లాంటి యంగ్ డైరెక్టర్ సైతం ఇప్పుడు స్టార్ డైరెక్టర్ గా ఎదిగే ప్రయత్నంలో ఉన్నాడు. తనదైన రీతిలో సత్తా చాటుకోవడమే కాకుండా ఆయనకంటూ ఒక సపరేట్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవడంలో ఆయన ఎప్పుడు ముందు వరుసలో ఉంటున్నాడు. ఇక ఇప్పటికే ఆయన చేస్తున్న ప్రతి సినిమాతో ప్రేక్షకుల్లో మంచి అంచనాలను పెంచడమే కాకుండా తనకంటూ ఒక సెపరేట్ ఐడెంటిటిని కూడా క్రియేట్ చేసుకుంటున్నాడు…ఇక ఇదిలా ఉంటే రీసెంట్ గా ఆయన తన దగ్గర 33 స్టోరీలు ఉన్నాయని చెప్పాడు. నిజానికి ఆయన దగ్గర అన్ని కథలు ఉన్నాయా అంటూ కొంతమంది అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రశాంత్ వర్మ ప్రస్తుతం తన దగ్గర ఉన్న లైన్ చెప్పి కొంతమంది రైటర్స్ చేత రాయిస్తున్నట్టుగా తెలుస్తోంది. అంటే పూర్తిగా ఆయన కథ రాయకుండా కొంతమంది ని టీమ్ గా చేసుకొని వాళ్ల చేత ఆ కథలను రాయిస్తున్నాడు. దీనివల్ల కథలను ఆయన రాసిన క్రిడిట్ అయితే కొట్టేస్తున్నాడు. అంటూ కొంతమంది సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.
ఇక ప్రస్తుతానికి ప్రశాంత్ వర్మ యూనివర్స్ కింద చాలా సినిమాలను ప్రొడ్యూస్ చేయాలని అలాగే తమ టీం లో ఉన్న వాళ్ళ చేత డైరెక్షన్ చేయించాలనే ఉద్దేశ్యంతో ప్రశాంత్ వర్మ ముందుకు సాగుతున్నాడు. మరి ఆయన అనుకున్నట్టుగానే ప్రశాంత్ వర్మ యూనివర్స్ లో చాలా సినిమాలను చేస్తారా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.
ఇక ప్రస్తుతం ఆయన బాలయ్య బాబు కొడుకు అయిన మోక్షజ్ఞ ని సినిమా ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేసే పనిలో బిజీగా ఉన్నాడు. ఇక దాంతో పాటుగా ‘జై హనుమాన్’ అనే సినిమాను కూడా తెరకెక్కిస్తున్నాడు. ఇక ‘హనుమాన్ ‘ సినిమాకి సీక్వేల్ గా వస్తున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని సాధిస్తుంది.
తద్వారా ప్రశాంత్ వర్మకి ఎలాంటి క్రేజ్ దక్కుతుంది అనేది కూడా తెలియాల్సిన అవసరం అయితే ఉంది…ఇక ప్రస్తుతం యంగ్ డైరెక్టర్లందరిలో ఆయన ఒక అడుగు ముందువరుసలో ఉన్నాడనే చెప్పాలి. ఇక ఇప్పటికే పాన్ ఇండియాలో సత్తా చాటుకొని హనుమాన్ సినిమాతో 400 కోట్ల వరకు కలెక్షన్లను రాబట్టాడు. ఇక జై హనుమాన్ సినిమాతో దాదాపు 1000 కోట్ల కలెక్షన్లు రాబడతాను అంటూ దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నాడు…