Mahesh Babu Best Friend: సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నటుడు మహేష్ బాబు…ఈయన తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తుండడం విశేషం… ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ‘వారణాసి’ అనే సినిమా చేస్తున్నాడు…ఈ సినిమా 1300 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. మొత్తానికైతే ఈ సినిమాతో తనకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ చేసుకోవాలని చూస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఈ సినిమాతో మహేష్ బాబు మరోసారి తన సత్తా చాటుకుంటాడా? లేదా అనేది తెలియాల్సి ఉంది… మహేష్ బాబు సినిమాల విషయంలో చాలా ఫాస్ట్ గా ఉన్నప్పటికి బయట ఫంక్షన్స్ విషయంలో మాత్రం అతను ఎక్కడ కనిపించడు… కారణం ఏంటి అంటే ఆయనకి చాలా తక్కువ మంది ఫ్రెండ్స్ అయితే ఉన్నారు. అందుకే ఆయన బయట ఎక్కువగా కనిపించారు.
తన కెరియర్ స్టార్టింగ్ లో గుణశేఖర్, త్రివిక్రమ్ లాంటి దర్శకులతో స్నేహం చేసిన మహేష్ బాబు తన బెస్ట్ ఫ్రెండ్ ఎవరు అనేది ఇప్పటివరకు ఎక్కడా చెప్పలేదు. మొత్తానికైతే రీసెంట్ గా ఆయన ఈవెంట్ జరుగుతున్న సందర్భంలో తనకి బెస్ట్ ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారు అంటే అది తన భార్య అయిన నమ్రత శిరోడ్కర్ అని చెప్పడం విశేషం…ఎందుకంటే తను ప్రతి విషయాన్ని ఆమె తోనే షేర్ చేసుకుంటారట.
సినిమాలకు సంబంధించిన విషయాలను కాకుండా పర్సనల్ విషయాల్లో కూడా వాళ్ళిద్దరు ఒకరికి ఒకరు తోడుగా ఉంటారు. కాబట్టి మహేష్ బాబుకి సెపరేట్ గా బెస్ట్ ఫ్రెండ్ ఉండాల్సిన అవసరం లేకుండా పోయిందని తను చెబుతుండడం విశేషం… ఇక ఏది ఏమైనా కూడా మహేష్ బాబు వరుస సక్సెస్ లతో ముందుకు సాగుతున్నాడు. మహేష్ ఏ సినిమా చేయాలన్నా కూడా మొదట నమ్రత ఆ కథ విని అది మహేష్ కి సెట్ అవుతుందా? లేదా అని చెక్ చేసి ఫైనల్ చేస్తుంది.
ఆ తర్వాతే మహేష్ బాబు సినిమాని చేస్తుంటాడు. అందుకే అతని సక్సెస్ రేట్ చాలా ఎక్కువగా ఉందని పలువురు సినిమా మేధావులు సైతం అభిప్రాయపడుతున్నారు. ఇక మహేష్ బాబు కొడుకు అయిన గౌతమ్ కృష్ణ సైతం తొందర్లోనే సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు…