Sreeja Konidela: మెగా డాటర్ శ్రీజ మూడో పెళ్లి చేసుకునే ఈ వ్యక్తి ఎవరో తెలుసా?

శ్రీజ వివాహం చేసుకోబోయే వ్యక్తి ఇతనే అంటూ సోషల్ మీడియాలో ప్రచారం మొదలుపెట్టారు. అయితే శ్రీజ షేర్ చేసిన ఫొటోలో ఉన్న వ్యక్తి ఆమె జిమ్ ట్రైనర్ అని తెలుస్తుంది. అంతే కానీ శ్రీజా మూడో వివాహం వార్తల్లో నిజం లేదంటున్నారు.

Written By: Shiva, Updated On : October 8, 2023 5:08 pm

Sreeja Konidela

Follow us on

Sreeja Konidela: మెగా డాటర్ శ్రీజ భర్త కళ్యాణ్ దేవ్ కి దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. కళ్యాణ్ దేవ్-శ్రీజ కలిసి కనిపించి ఏడాది దాటిపోయింది. అయితే ఎలాంటి విడాకుల ప్రకటన రాలేదు. గతంలో కళ్యాణ్ దేవ్ చిరంజీవి ఇంట్లో ఉండేవాడు. భార్య పిల్లలతో ఆయన అక్కడే ఉండేవారు. ఇప్పుడు కళ్యాణ్ దేవ్ తన పేరెంట్స్ తో ఉంటున్నాడు. శ్రీజ-కళ్యాణ్ దేవ్ లకు ఓ పాప ఉంది. ఆ పాప పేరు నవిష్క. నవిష్కను బాగా మిస్ అవుతున్నట్లు కళ్యాణ్ దేవ్ సోషల్ మీడియాలో పోస్ట్స్ పెడుతూ ఉంటాడు.

కానీ అప్పుడప్పుడు కలుస్తూ ఉంటాడు. నవిష్కను కలిసినప్పుడు ఆ ఫోటోలు సోషల్ మీడియాలో పెడతాడు. తన ఆనందం తెలియజేస్తాడు. ఈ పరిణామాల నేపథ్యంలో శ్రీజ-కళ్యాణ్ దేవ్ విడిపోయారని చిత్ర వర్గాల సమాచారం. ఈ క్రమంలో శ్రీజా మూడో పెళ్లి వార్తలు తరచుగా తెరపైకి వస్తూ ఉంటాయి. తాజాగా శ్రీజ ఓ వ్యక్తితో దిగిన ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు.

దీంతో శ్రీజ వివాహం చేసుకోబోయే వ్యక్తి ఇతనే అంటూ సోషల్ మీడియాలో ప్రచారం మొదలుపెట్టారు. అయితే శ్రీజ షేర్ చేసిన ఫొటోలో ఉన్న వ్యక్తి ఆమె జిమ్ ట్రైనర్ అని తెలుస్తుంది. అంతే కానీ శ్రీజా మూడో వివాహం వార్తల్లో నిజం లేదంటున్నారు. గతంలో కూడా శ్రీజా మూడో వివాహంపై ఇలాంటి వార్తలే వచ్చాయి. అవన్నీ వీగిపోయాయి. మరోసారి ఈ వార్తలు కలకలం రేపాయి.

కాగా శ్రీజా చదువుకునే రోజుల్లో తన క్లాస్ మేట్ ని ప్రేమ వివాహం చేసుకున్నారు. అప్పట్లో ఈ వార్త సంచలనమైంది. మొదటి భర్తతో శ్రీజాకు ఒక అమ్మాయి. అయితే మనస్పర్థలతో మొదటి భర్తతో శ్రీజా విడిపోయారు. కూతురితో పాటు తండ్రి చిరంజీవి వద్దకు వచ్చేసింది. చిరంజీవి ఆమెకు కళ్యాణ్ దేవ్ తో రెండో వివాహం చేశారు. వీరు అన్యోన్య దంపతులుగా ఉన్నారు. చిరంజీవి అల్లుడు హోదాలో కళ్యాణ్ దేవ్ హీరోగా మారాడు. విజేత చిత్రంతో హీరోగా మారాడు. చిరంజీవి ఫ్యామిలీ ఆయనకు మద్దతుగా ఉన్నారు. అయితే శ్రీజాతో విడిపోయాక అతనికి మెగా ఫ్యామిలీ నుండి ఆదరణ కరువైంది. ఇప్పుడు సినిమాలు చేయడం లేదు.