NTR: 16 సంవత్సరాలకే హీరోగా ఇండస్ట్రీకి పరిచయం అయి, రెండోవ సినిమాతో సక్సెస్ ఫుల్ హీరోగా మంచి గుర్తింపును సంపాదించుకున్న నటుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఇక ఆది సినిమాతో ఈయన 30 కోట్ల మార్క్ ని టచ్ చేసి ఇండస్ట్రీలో మెగాస్టార్ గా కొనసాగుతున్న చిరంజీవి ఇంద్ర సినిమాతో సైతం పోటీపడి భారీ కలెక్షన్స్ ను రాబట్టడం అంటే మామూలు విషయం కాదు. అలాంటి ఎన్టీఆర్ కి బృందావనం సినిమా తర్వాత చేసిన అన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయి.
ఒక ఐదు సంవత్సరాల వరకు తనకి ఒక సక్సెస్ కూడా రాకపోవడంతో ఇండస్ట్రీలో తన మార్కెట్ అనేది భారీగా డౌన్ అయింది. అలాంటి సమయంలో పూరి జగన్నాధ్ లాంటి స్టార్ డైరెక్టర్ తో టెంపర్ అనే సినిమా చేశాడు. ఈ సినిమా సూపర్ సక్సెస్ సాధించడంతో ఎన్టీఆర్ మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కాడు. అయితే ఈ సినిమాని ముందుగా పూరి జగన్నాథ్ వేరే ప్రొడ్యూసర్ తో చేద్దామని అనుకున్నాడట. కానీ ఈ సినిమా ప్రొడ్యూసర్ అయిన బండ్ల గణేష్ మొత్తానికి పూరీని మేనేజ్ చేసి ఈ సినిమాని తన బ్యానర్ లో చేసేలా చేశాడు.
మొత్తానికైతే ఈ సినిమాతో పూరీకి, ఎన్టీఆర్ కి, బండ్ల గణేష్ కి ముగ్గురికి ఒక భారీ సక్సెస్ అయితే వచ్చిందనే చెప్పాలి. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ కనబరచిన నటన నెక్స్ట్ లెవెల్లో ఉంటుందనే చెప్పాలి. ఆయన చేసిన పాత్రలో మరే హీరో అయిన కూడా అంత బెస్ట్ పర్ఫామెన్స్ అయితే ఇవ్వలేడనేది వాస్తవం…ఇక ఆ సినిమా నుంచి త్రిబుల్ ఆర్ సినిమా వరకు ఆయన వరుసగా ఆరు సినిమాలతో సక్సెస్ లను అందుకున్నాడు.
ఇప్పుడు కనక దేవర సినిమాతో మరో సక్సెస్ ను అందుకుంటే ఇప్పుడున్న స్టార్ హీరోల్లో ఎవరికి సాధ్యం కాని రీతిలో వరుసగా ఏడు సినిమాలతో సక్సెస్ అందుకున్న ఏకైక హీరోగా ఎన్టీయార్ మంచి గుర్తింపును పొందుతాడు… ఇక ఇది ఇలా ఉంటే ఎన్టీయార్ మాత్రం దేవర సినిమా తో పాన్ ఇండియా లో తన ప్రభంజనాన్ని సృష్టించబోతున్నట్టు గా తెలుస్తుంది.