https://oktelugu.com/

Nagarjuna: నాగార్జున 100 వ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవ్వబోతుంది…డైరెక్టర్ ఎవరు..?

ప్రస్తుతం సినిమా అనేది ప్రతి ఒక్కరికి ఒక ఎమోషన్ గా మారిపోయింది. అందువల్లే ఎక్కువ మంది సినిమాలను చూస్తూ ఎంటర్టైన్ అవ్వడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు. వాళ్లకు ఉన్న ప్రాబ్లమ్స్ నుంచి రిలాక్స్ అవ్వడానికి లేదా వాళ్ళను వాళ్లు ఎంటర్ టైన్ చేసుకోవడానికి సినిమాలను చూస్తూ బాగున్నా సినిమాలను ఆదరిస్తూ ఉంటారు. అందువల్లే తెలుగు ప్రేక్షకులు మంచి సినిమాలను ఎప్పుడు ఆదరిస్తూ ఉంటారని చాలామంది సినీ పెద్దలు చెబుతూ ఉంటారు...

Written By:
  • Gopi
  • , Updated On : October 27, 2024 / 04:26 PM IST

    Nagarjuna(5)

    Follow us on

    Nagarjuna: అక్కినేని నాగేశ్వరరావు కొడుకుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నాగార్జున చాలా తక్కువ సమయంలోనే తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్నాడు. అందువల్లే ఆయన ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలవడమే కాకుండా ఇండస్ట్రీలో ఉన్న చాలామంది యంగ్ డైరెక్టర్స్ ను సైతం తను ఎంకరేజ్ చేశాడు. ప్రస్తుతం ఆయన కూలీ సినిమాలో విలన్ గా నటిస్తున్నాడు. ఇక ఇప్పటివరకు హీరో గానే సినిమాలను చేసిన ఆయన లైఫ్ లో ఫస్ట్ టైం విలన్ పాత్రను పోషిస్తూ ఉండడం విశేషం…రజినీకాంత్ లాంటి నటుడి సినిమాలో ఆయన విలన్ పాత్రను పోషించడం అనేది నిజంగా గొప్ప విషయమనే చెప్పాలి. ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో ఆయనకు తమిళంలో భారీ మార్కెట్ అయితే క్రియేట్ అవ్వబోతుందనేది వాస్తవం. ఇక దాంతో పాటుగా ఆయన శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ హీరోగా వస్తున్న ‘కుబేర’ సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తున్నాడు. ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో కూడా భారీ సక్సెస్ ని సాధించాలని చూస్తున్నాడు… ఇక ఇదిలా ఉంటే తను హీరోగా ప్రస్తుతం 99 సినిమాలు చేశాడు.

    ఇక 100 సినిమా కోసం భారీ కసరత్తులు చేస్తున్నప్పటికి ఆ సినిమాను ఎవరితో చేయాలి అనే విషయంలోనే తను చాలా వరకు సందిగ్ధ పరిస్థితుల్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి ఆ సినిమాని సక్సెస్ ఫుల్ గా నిలిపే దర్శకుడు ఎవరు అనే దానికోసమే భారీ కసరత్తులు చేస్తున్నాడు. ఇక ఇంతకుముందు కొంతమంది దర్శకులను సినిమా కోసం తీసుకున్నప్పటికి వాళ్ళు ఎవరూ ఆ సినిమాకి సెట్ అవ్వరు అనే ఉద్దేశ్యంతోనే ఆయన ఈ సినిమాని హోల్డ్ లో పెట్టాడు.

    ఇక మొత్తానికైతే తను ఒక స్టార్ డైరెక్టర్ తోనే ఈ సినిమా చేయడానికి సన్నాహలు చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పటివరకు భారీ సక్సెస్ లను అందుకున్న కొరటాల శివతో తను సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు అంటూ మరికొంతమంది కామెంట్లైతే చేస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా కొరటాల శివ కూడా రీసెంట్ గా దేవర సినిమాతో సూపర్ సక్సెస్ ని అందుకున్నాడు.

    కాబట్టి తన డైరెక్షన్ లో కూడా సినిమా చేయడానికి నాగార్జున ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి కొరటాల శివ గాని నాగార్జున గాని ఈ విషయం మీద అఫీషియల్ గా అనౌన్స్ చేస్తే తప్ప ఈ సినిమా ఉంటుందా లేదా అనేది కన్ఫర్మ్ అవ్వదు…