Chiranjeevi Hitler Movie: మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో హిట్స్ మాత్రమే కాదు, డిజాస్టర్ ఫ్లాప్స్ కూడా ఉన్నాయి అనే విషయం అందరికీ తెలిసిందే. ఒకానొక దశలో ఆయన సంవత్సరాల తరబడి ఫ్లాప్ స్ట్రీక్ లోనే ఉండేవాడు. ఆయన ఫ్లాప్ స్ట్రీక్ ని చూసి దురాభిమానులు ఇక చిరంజీవి పని అయిపోయింది అంటూ శునకానందం పొందేవాళ్ళు, అలాంటి సమయం లో ఆయన దిమ్మ తిరిగే కం బ్యాక్ ఇస్తూ ఫ్యాన్స్ కి కిక్ ఇవ్వడం అలవాటు.
అలా రీసెంట్ గా ‘వాల్తేరు వీరయ్య’ సినిమా విషయం లో జరిగింది. అప్పట్లో ఆయనకీ అలా ‘హిట్లర్’ అనే సినిమా ద్వారా ఇలాంటి కం బ్యాక్ ఇచ్చాడు. అప్పట్లో ఈవీవీ సత్యనారాయణ మెగాస్టార్ చిరంజీవి తో ‘అల్లుడా మజాకా ‘ అనే చిత్రం చేసాడు. ఈ సినిమా కమర్షియల్ గా హిట్ అయ్యింది కానీ, ఇందులో అసభ్య పదజాలం మరియు డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉండడం వల్ల ఫ్యామిలీ ఆడియన్స్ లో చిరంజీవి కి బాగా చెడ్డ పేరు వచ్చింది.
అలాంటి సమయం లో ఆయనకి ‘హిట్లర్’ అనే చిత్రం బాగా ఉపయోగ పడింది. ఆ రోజుల్లో ఈ చిత్రం పెద్ద కమర్షియల్ హిట్ అయితే అయ్యింది కానీ, ఇండస్ట్రీ రికార్డ్స్ ని మాత్రం తిరిగి రాయలేకపోయింది. కానీ చిరంజీవికి ఫ్యామిలీ ఆడియన్స్ లో మంచి ఇమేజిని తెచ్చిపెట్టింది. 5 మంది చెల్లెలకు అన్నయ్య గా చిరంజీవి ఈ సినిమాలో ఎంతో అద్భుతంగా నటించాడు. చాలా సన్నివేశాల్లో ఆయన ఎమోషనల్ యాక్టింగ్ కి ఏడుపు ఆపుకోలేము, ఇప్పటికీ ఈ సినిమాని చూస్తే అదే ఫీలింగ్ వస్తుంది. ఈ చిత్రం మలయాళం లో సూపర్ హిట్ గా నిల్చిన ‘హిట్లర్’ చిత్రానికి రీమేక్.
ఈ సినిమాని తొలుత కలెక్షన్ కింగ్ మోహన్ బాబు రీమేక్ చెయ్యాలనుకున్నాడు, కానీ అప్పటికే చిరంజీవి రీమేక్ రైట్స్ దక్కించుకోవడం తో ఈ సినిమా మోహన్ బాబు చెయ్యలేకపోయాడు. ఎంతో ఆశపడి ఈ సినిమాలో నటించాలని ప్రయత్నం చేసాడట, కానీ రీమేక్ రైట్స్ దక్కకపోవడం తో ఆయన చాలా హర్ట్ అయ్యినట్టు అప్పట్లో వార్తలు కూడా వినిపించాయి. ఒకవేళ మోహన్ బాబు ఈ సినిమా ఒప్పుకొని చేసి ఉంటే కచ్చితంగా ఈ సినిమా ఫ్లాప్ అయ్యేదని అంటున్నారు ట్రేడ్ పండితులు.