https://oktelugu.com/

Mahesh Babu: సినిమా ఇండస్ట్రీ లో మహేష్ బాబు కి ఉన్న ఒకే ఒక శత్రువు ఎవరో తెలుసా..?

మహేష్ బాబు దాకా వెళ్లడంతో ఎప్పటికైనా ప్రొడ్యూసర్ కి సమాధానం చెప్పాలనే కోపం తో మహేష్ బాబు ఆయన్ని శత్రువు గా భావించి కసి గా సినిమాలు చేసేవాడట.

Written By:
  • Gopi
  • , Updated On : January 3, 2024 / 04:40 PM IST

    Mahesh Babu

    Follow us on

    Mahesh Babu: అప్పట్లో సూపర్ స్టార్ కృష్ణ చాలా మంచి సినిమాలు చేసి ఇండస్ట్రీ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని అయితే ఏర్పాటు చేసుకున్నాడు. ఇక ఆయన తర్వాత ఆయన కొడుకు అయిన మహేష్ బాబు సూపర్ స్టార్ ఇమేజ్ ని అందుకొని తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకొని ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ హీరో గా తన కెరీయర్ ని కొనసాగిస్తున్నాడు. ఇక ఇప్పటికే వరుస సినిమాలను చేస్తూ మంచి విజయాలను అందుకుంటున్న మహేష్ బాబు తనదైన రీతిలో నటిస్తూ సత్తా చాటుతూ ముందుకు కదులుతున్నాడు.

    ఇక ఈయనకి తన కెరియర్ లో వచ్చిన మొదటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమా ఏదీ అంటే అది ఒక్కడు సినిమా అనే చెప్పాలి. ఒక్కడు సినిమాకి ముందు మహేష్ బాబుని చాలామంది చాలా రకాలుగా కామెంట్లు చేసేవారట. మహేష్ బాబు కి సరిగ్గా యాక్టింగ్ రాదు అంటూ విమర్శించే వారట అందులో భాగంగానే ఒక ప్రొడ్యూసర్ కి ఒక డైరెక్టర్ కథ చెప్పి దీన్ని మహేష్ తో చేద్దాం అని చెబితే ఆ ప్రొడ్యూసర్ మహేష్ తో వద్దు ఆయనకి యాక్టింగ్ రాదు అని చెప్పాడట.

    ఆ విషయం మహేష్ బాబు దాకా వెళ్లడంతో ఎప్పటికైనా ప్రొడ్యూసర్ కి సమాధానం చెప్పాలనే కోపం తో మహేష్ బాబు ఆయన్ని శత్రువు గా భావించి కసి గా సినిమాలు చేసేవాడట…అయితే ఇదంతా మురారి సినిమాకి ముందు జరిగింది ఇక మురారి సినిమాతో తనలో ఉన్నటువంటి నటుడుని బయటకు తీసిన మహేష్ బాబు ఆ సినిమాతోనే ఆయన పై కామెంట్లు చేసిన ఆ ప్రొడ్యూసర్ కి తన దైవ రీతిలో సమాధానం చెప్పాడు.

    ఇక ఆ తర్వాత ఒక్కడు సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం అలాగే మహేష్ నటుడిగా, స్టార్ హీరోగా గుర్తింపు పొందటం చూసిన ఆ ప్రొడ్యూసర్ మహేష్ బాబు ఎదురు పడ్డప్పుడు తలకిందుకేసుకొని ఉన్నాడట అలా ఆ ప్రొడ్యూసర్ ను చూసిన మహేష్ బాబు వాడికి తగిన బుద్ది చెప్పాను అని అనుకున్నాడట… అలా మనల్ని కామెంట్స్ చేసినవాడు మన ముందు సైలెంట్ గా నిలబడేలా చేసినప్పుడే మనం నిజమైన విజయాన్ని అందుకున్నట్లు అవుతుంది…ఇక ప్రస్తుతం ఈ విషయాన్ని సోషల్ మీడియా లో హైలెట్ చేస్తు మహేష్ బాబు ఫ్యాన్స్ దీన్ని తెగ వైరల్ చేస్తున్నారు…