Rajinikanth: ప్రస్తుతం పాన్ ఇండియాలో భారీ మార్కెట్ ను క్రియేట్ చేసుకుంటున్న హీరోలు అదే రేంజ్ లో రెమ్యూనరేషన్ ని కూడా తీసుకుంటున్నారు. ఇక యంగ్ హీరోలు, స్టార్ హీరోలు అనే తేడా లేకుండా కొత్త కాన్సెప్ట్ తో సినిమాలు చేసి సూపర్ సక్సెస్ లను అందుకున్న ప్రతి ఒక్కరు భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ అయితే తీసుకుంటున్నారు. ఇక ఇండియాలో ఉన్న స్టార్ హీరోలందరిలో అత్యధికమైన రెమ్యూనరేషన్ ను తీసుకుంటున్న హీరోగా తమిళ సినిమా ఇండస్ట్రీకి చెందిన సూపర్ స్టార్ ‘రజినీకాంత్’ నిలవడం అనేది నిజంగా గొప్ప విషయమనే చెప్పాలి. ప్రస్తుతానికి రజనీకాంత్ కి పాన్ ఇండియాలో భారీ మార్కెట్ అయితే ఉంది. ఇక దాని వల్లే ప్రొడ్యూసర్స్ ఆయనకు అడిగినంత డబ్బులు ఇస్తున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. కూలీ సినిమా కోసం దాదాపు ఆయన 100 కోట్లకి పైన రెమ్యూనరేషన్ ను తీసుకున్నట్టుగా కూడా తెలుస్తోంది. నిజానికి రజనీకాంత్ జైలర్ సినిమాతో పాన్ ఇండియాలో భారీ మార్కెట్ ని క్రియేట్ చేసుకున్నాడు. ఈ సినిమా దాదాపు 300 కోట్లకు పైన కలెక్షన్లు రాబట్టటంతో ఇప్పుడు చేయబోతున్న సినిమాలు దాదాపు 500 కోట్ల వరకు కలెక్షన్లు రాబడతాయనే ఉద్దేశ్యంతోనే రజినీకాంత్ భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇక తెలుగు, తమిళ్ , మలయాళం, కన్నడ, ఇండస్ట్రీలో ఉన్న సీనియర్ హీరోలెవ్వరికి సాధ్యం కానీ రీతిలో ఆయన ఇంత మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకోవడం అనేది ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.
ఇక మిగతా హీరోలకి తనకి ఉన్న తేడా ఏంటి అంటే ఆయనకు పాన్ ఇండియాలో కూడా మంచి మార్కెట్ అయితే ఉంది. మిగతా హీరోలకు వాళ్ళ వాళ్ళ భాషల్లో తప్ప మిగతా భాషల్లో పెద్దగా పట్టు అయితే లేకపోవడమే దానికి కారణం అని చెప్పొచ్చు…
ఇక ప్రస్తుతం లోకేష్ కనకరాజ్ డైరెక్షన్లో చేస్తున్న కూలీ సినిమా లో ఆయన మాఫీయా డాన్ గా కనిపించబోతున్నాడు. ఇక స్టైలిష్ పాత్రలో రజనీకాంత్ కనిపించబోతున్నాడని లోకేష్ కనకరాజ్ ఇంతకు ముందే మనకు తెలియజేశాడు…ఇక ఈ సినిమాతో కనక సూపర్ సక్సెస్ సాధిస్తే ఆయన మార్కెట్ మరింతగా పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి.
ఇక దిక ఉంటే ఈ నెల 10 వ తేదీన ‘వేట్టయాన్ ‘ సినిమాతో రజనీకాంత్ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమా మంచి విజయాన్ని సాధిస్తుందని రజనీకాంత్ ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. చూడాలి మరి ఈ సినిమా ఎంతటి సక్సెస్ సాధిస్తుంది. తద్వారా రజనీకాంత్ కి ఎలా ఉపయోగపడుతుంది అనేది…