NTR: తెలుగు సినిమా ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ కి చాలా మంచి గుర్తింపు అయితే ఉంది. ప్రస్తుతం ఆయన పాన్ ఇండియాలో తన మ్యాజిక్ ని క్రియేట్ చేస్తున్నాడు. రీసెంట్ గా దేవర సినిమాతో సూపర్ సక్సెస్ ని అందుకున్న ఆయన ఈ సినిమాతో 500 కోట్లకు పైన కలెక్షన్లు రాబట్టి ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇక ఈ సినిమా లాంగ్ రన్ లో దాదాపు 700 నుంచి 800 కోట్ల వరకు కలెక్షన్లును రాబడుతుందనే అంచనాలైతే ఉన్నాయి. కేవలం 300 కోట్ల రూపాయలతో తెరకెక్కిన ఈ సినిమా ఇన్ని వందల కోట్ల కలెక్షన్స్ ను రాబట్టడం అనేది నిజంగా ఒక గొప్ప విషయమనే చెప్పాలి. ఇక ఏది ఏమైనప్పటికీ ఈ సినిమా విషయంలో జూనియర్ ఎన్టీఆర్ చాలా వరకు కష్టపడ్డాడు. ‘త్రిబుల్ ఆర్’ సినిమా అయిపోయిన తర్వాత దాదాపు మూడు సంవత్సరాల పాటు ఈ ఒక్క సినిమా మీదనే తన డేట్స్ మొత్తాన్ని కేటాయించి ఈ సినిమా కోసమే విపరీతంగా కష్టపడుతూ ఉండటం అనేది నిజంగా ఒక గొప్ప విషయమనే చెప్పాలి. ఇక ఏది ఏమైనా కూడా జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా వెలుగొందుతున్నాడు. ఇక ప్రస్తుతం ఆయన బాలీవుడ్ లో వార్ 2 సినిమాను చేస్తూనే ప్రశాంత్ నీల్ తో మరొక సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు. ఇక రీసెంట్ గా ముహూర్తం ముగించుకున్న ఈ సినిమా తొందర్లోనే రెగ్యూలర్ షూటింగ్ కి వెళ్ళబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది.
ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం జూనియర్ ఎన్టీఆర్ లైనప్ లోకి మరొక స్టార్ డైరెక్టర్ వచ్చి చేరినట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా తమిళ్ సినిమా ఇండస్ట్రీకి చెందిన నెల్సన్ జూనియర్ ఎన్టీఆర్ తో చాలా రోజుల నుంచి ఒక సక్సెస్ ఫుల్ సినిమాని తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్నాడు.
గత సంవత్సరం ఈయన రజనీకాంత్ తో చేసిన ‘జైలర్’ సినిమా సూపర్ సక్సెస్ అయింది. ఇక దాంతోనే ఆయన మిగితా స్టార్ హీరోలతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాడు. ప్రస్తుతం రజనీకాంత్ ‘జైలర్ 2’ సినిమాని తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్నప్పటికీ ఈ సినిమా పూర్తయిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తో ఒక యాక్షన్ ఎమోషనల్ డ్రామాని తెరకెక్కించడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు.
ఇక అందులో భాగంగానే రీసెంట్ గా జూనియర్ ఎన్టీఆర్ కి తను కథ కూడా వినిపించినట్టుగా వార్తలైతే వస్తున్నాయి. ఎన్టీఆర్ తన అభిప్రాయాన్ని చెప్పాడా? లేదా ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడా? లేదా అనే విషయాల మీద సరైన క్లారిటీ అయితే రావడం లేదు…