Baahubali: రాజమౌళి ఎంత కోరినా.. వాటర్ సీన్ చేయనని ‘బాహుబలి’ని వదులుకున్న హీరోయిన్

డైరెక్టర్ రాజమౌళి కెరీర్లో తీసిన బిగ్గెస్టు మూవీ బాహుబలి. ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరూ ఫేమస్ అయ్యారు. మల్టీ స్టార్ గా వచ్చిన ఇందులో ముగ్గురు హీరోయిన్లు కనిపిస్తారు. రమ్యకృష్ణ, అనుష్క, తమన్నా.

Written By: Chai Muchhata, Updated On : May 30, 2023 1:08 pm

Baahubali

Follow us on

Baahubali: ఇప్పుడొస్తున్న సినిమాల్లో హీరోలతో సమానంగా హీరోయిన్లు నటించాల్సి వస్తోంది. సీన్ ఏదైనా చేయడానికి రెడీ అంటేనే డైరెక్టర్లు సినిమాల్లో ఛాన్స్ ఇస్తున్నారు. అయితే కొందరు ఏ సీన్లోనైనా నటించడానికి రెడీగా ఉంటారు. కానీ కొందరు ఒప్పుకోరు. పెద్ద పెద్ద డైరెక్టర్లు వచ్చి అడిగినా ఫలానా సీన్లో నటించాల్సి ఉంటుందని చెప్పగానే వాటిని రిజెక్ట్ చేస్తూ హిట్టు సినిమాలను వదులుకుంటారు. అలా సౌత్ ఇండస్ట్రీలో స్టార్ ఇమేజ్ కోసం కష్టపడుతున్న ఓ హీరోయిన్ కు ‘బాహుబలి’లో నటించే ఆఫర్ వచ్చింది.అయితే ఇందులో నీళ్లలో నటించే సీన్ ఒకటి ఉంది. ఇందులో నటించాల్సి ఉండడంతో ఆ భామ తాను వాటర్ సీన్ చేయనని తెగేసి చెప్పిందట. దీంతో రాజమౌళి ఆమెను తప్పించి మరో హీరోయిన్ కు అవకాశం ఇచ్చాడు. కానీ అలా నటించిన హీరోయిన్ ఇప్పుడు పాన్ ఇండియా లెవల్లో దూసుకుపోతుంది. కానీ ఈ సినిమా వదులుకున్న నటి మాత్రం ఇంకా కష్టపడుతూనే ఉంటోంది. ఇంతకీ ఎవరామె?

డైరెక్టర్ రాజమౌళి కెరీర్లో తీసిన బిగ్గెస్టు మూవీ బాహుబలి. ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరూ ఫేమస్ అయ్యారు. మల్టీ స్టార్ గా వచ్చిన ఇందులో ముగ్గురు హీరోయిన్లు కనిపిస్తారు. రమ్యకృష్ణ, అనుష్క, తమన్నా. మూడో హీరోయిన్ విషయానికొస్తే తమన్నా బాహుబలి పార్ట్ 1లో కీలకంగా కనిపిస్తుంది. చిన్న ప్రభాస్ తో కలిసి రొమాంటిక్ సీన్లలో నటించింది. ఓ వైపు అందమైన హీరోయిన్ గానే ఉంటూ.. మరో వైపు యుద్ధ సన్నివేశాల్లో డీ గ్లామర్ పాత్ర పోషిస్తుంది. అయితే తమన్నా ప్లేసులో అంతకుముందు బాహుబలి ఓ హీరోయిన్ కు అవకాశం ఇచ్చాడట. కానీ ఆమె నీళ్లలో నటించనని చెప్పడంతో ఆమెను పక్కన పెట్టేశారట.

ఆ భామ ఎవరో కాదు రాశిఖన్నా. పాల బుగ్గలతో, చిన్న చిరునవ్వుతో ఆకట్టుకునే రాశి ఖన్నా వాస్తవానికి తమన్నా ప్లేసులో ఉండాలి. దీంతో రాజమౌళి ముందుగానే ఆమెను ఊహించుకొని రాశిఖన్నాకు అవకాశం ఇచ్చారట. బాహుబలి ఎక్కువ శాతం వాటర్ సీన్స్ ఎక్కువగా ఉంటాయి. అయితే రాశిఖన్నాను ఎక్కువ సేపు వాటర్ ఉంటే అలర్జీ అవుతుందట. అందుకే వాటర్ సీన్స్ లేకుండా చూసుకుంటుందట. కానీ బాహుబలిలో ఎక్కువ శాతం నీళ్లలోనే నటించాలి. దీంతో ఆమె నటించనని చెప్పడంతో మొత్తానికే ఆమెను పక్కనబెట్టి తమన్నాకు అవకాశం ఇచ్చాడట.

ఈ సినిమాలో తమన్నా నటించిన తరువాత ఏ రేంజ్ లో దూసుకుపోతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు తమన్నా తెలుగులోనే కాకుండా తమిళం, హిందీ సినిమాల్లోనూ అవకాశాలు తెచ్చుకుంటుంది. అయితే స్టార్ డం కోసం విపరీతంగా కష్టపడుతున్న రాశిఖన్నా ఈ సినిమా వదులుకోవడంతో చేజేతులారా కెరీర్ ను నాశనం చేసుకున్నట్లయిందని కొందరు అంటున్నారు. ఈ సినిమాలో నటిస్తే రాశిఖన్నా ప్రస్తుతం స్టార్ హీరోయిన్ అయ్యేదని అంటున్నారు. ఏంతైనా అదృష్టం అందరికీ ఉంటుందా? అని కొందరు సింపతీ చూపిస్తున్నారు.