The Odyssey : క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన లేటెస్ట్ చిత్రం ‘ది ఒడిస్సీ’ రీసెంట్ గానే భారీ అంచనాల నడుమ విడుదలై, ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లోనూ రికార్డు స్థాయి వసూళ్లను రాబడుతూ , సెన్సేషన్ క్రియేట్ చేస్తూ ముందుకు దూసుకువెళ్తోంది. మన ఇండియన్స్ కూడా ఈ చిత్రానికి బ్రహ్మరథం పడుతున్నారు. క్రిస్టోఫర్ నోలన్ సినిమాలకు సాధారణంగానే మన ఇండియన్స్ లో మంచి క్రేజ్ ఉంటుంది. అలాంటిది గ్రీక్ మైథాలజీ మీద తీస్తే ఈ మాత్రం క్రేజ్ ఏర్పడడం లో ఎలాంటి ఆశ్చర్యం లేదు. అయితే నోలన్ ఈ సినిమాలో అనేక సన్నివేశాలను మన రామాయణం , మహాభారతం ని ఆధారంగా తీసుకొని తెరకెక్కించినట్టుగా అనిపించింది. సోషల్ మీడియా లో ఇప్పుడు దీని గురించే చర్చ. అంతే కాదు , ఈ చిత్రం లో పాత్రలను ‘బాహుబలి’ సిరీస్ లోని పాత్రలతో పోలుస్తూ , చాలా పోలికలు ఉన్నాయంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజెన్స్.
ముఖ్యంగా రామాయణం ఛాయలు ఈ చిత్రం లో ఉన్న విషయం గురించి మాట్లాడుకోవాల్సి వస్తే , ఈ చిత్రం లో ట్రోజన్ యుద్ధం ముగిసిన తర్వాత ఒడిస్సియస్ తన రాజ్యం ‘ఇదాకా’ కి తిరిగి వచ్చేందుకు పదేళ్ల పాటు ఎన్నో కష్టాలను ఎందుకుంటాడు. ఆయన ప్రయాణం లో సముద్ర తుఫానులు, రాక్షసులతో పోరాటాలు, ఎన్నో అనూహ్య పరీక్షలను చూస్తే , మనకు రామాయణం లో శ్రీరాముడు అరణ్యవాసం ఘట్టాన్ని గుర్తుకు తెస్తాయి. అదే విధంగా శివ ధనుస్సుని శ్రీరాముడు విరిచే ఘటన కి దగ్గర పోలికలతో మరో సన్నివేశాన్ని కూడా ఇందులో ఉంటుంది. ఇది కూడా రామాయణం ని ఆదర్శంగా తీసుకునే తెరకెక్కించారని అనిపిస్తుంది. ఇకపోతే ఈ చిత్రం లో అధీనా అనే దేవత ఒడిస్సియస్ కి నిత్యం అందంగా నిలుస్తూ వస్తుంది. అతనికి సలహాలు ఇస్తూ , నిరంతరం అతనిలో ధైర్యం నింపుతుంది.
ఈ పాత్రని చూస్తే మనకు మహాభారతం లో శ్రీకృష్ణుడి పాత్రనే గుర్తుకు వస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. కురుక్షేత్రం లో శ్రీకృష్ణుడు ఆయుధం పెట్టకపోయినా, యుద్దాన్ని మొత్తం తన సారథ్యం లోనే నడిపించి పాండవులకు విజయం అందేలా చేస్తారు. ‘అధీనా’ పాత్రని చూసినప్పుడు కూడా అదే ఫీలింగ్ కలుగుతుంది. ఇకపోతే ఈ చిత్రం లోని పాత్రలకు బాహుబలి పాత్రలతో పోలిక ఉందని కూడా అంటున్నారు నెటిజెన్స్. ఒడిస్సియస్ పాత్ర అమరేంద్ర బాహుబలి , పినెలోప్ పాత్ర దేవసేన, ఆంటీనోస్ పాత్ర భల్లాలదేవ . ఈయూమ్స్ పాత్ర కట్టప్ప పాత్రలతో పోలి ఉంటుందని అంటున్నారు నెటిజెన్స్. మీకు కూడా అలాగే అనిపించిందా?, ఈ చిత్రాన్ని చూసినవాళ్లు కామెంట్స్ రూపం లో తెలియజేయండి.
